NTV Telugu Site icon

FMGE Exam: ఇవాళ ఎఫ్‌ఎం‌జీఈ అర్హత పరీక్ష.. క్వశ్చన్ పేపర్పై కీలక ప్రకటన

Fmge

Fmge

FMGE Exam: ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామినేషన్‌ (FMGE).. విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసిన స్టూడెంట్స్ భారత్‌లో సేవలు అందించేందుకు ఈ అర్హత పరీక్షను తప్పకుండా రాయాల్సి ఉంటుంది. దీన్ని ఈ రోజు ( శనివారం ) దేశవ్యాప్తంగా 50 నగరాల్లోని 71 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించబోతున్నారు. నగదు చెల్లిస్తే ఎఫ్ఎంజీఈ ప్రశ్నాపత్రం అందిస్తామంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్‌(ఎన్‌బీఈ) తీవ్రంగా రియాక్ట్ అయింది. అవన్నీ మోసపూరిత ప్రకటనలే అని ఎన్‌బీఈ క్లారిటీ ఇచ్చింది. క్వశ్చన్ పేపర్ ఇంకా తయారీ దశలోనే ఉందని పేర్కొనింది. ప్రశ్నాపత్రాలపై ఈ తరహా ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్‌బీఈ చెప్పుకొచ్చింది. ఇలాంటి ఫేక్ ప్రచారం చేస్తున్న వారిపై ఇప్పటికే కేరళలో ఓ కేసు నమోదు అయిందని ఎన్‌బీఈ వెల్లడించింది. ఈలాంటి తప్పుడు న్యూస్ వైనల్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాని పోలీసులు సైతం పేర్కొన్నారు.

Show comments