Site icon NTV Telugu

Manipur: నితీష్‌కుమార్‌కు షాక్.. బీజేపీలోకి ఐదుగురు జేడీయూ ఎమ్మెల్యేలు

Jdu Mlas

Jdu Mlas

Manipur: మణిపూర్‌లోని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు చెందిన జనతాదళ్ (యునైటెడ్)కి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలలో ఐదుగురు శుక్రవారం అధికార బీజేపీలో చేరారు. నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ బీజేపీతో పొత్తును ముగించుకున్న కొన్ని వారాల తర్వాత ఇది జరగడం గమనార్హం. ఐదుగురు జేడీయూ ఎమ్మెల్యేలు శుక్రవారం అధికార పార్టీ బీజేపీలో విలీనమైనట్లు మణిపూర్ శాసనసభ సెక్రటేరియట్ నుంచి ఒక ప్రకటన ద్వారా తెలిసింది.

ఈశాన్య ప్రాంతంలో నితీష్ కుమార్ పార్టీ శాసనసభ్యులను బీజేపీ టార్గెట్ చేయడం ఇది రెండోసారి. 2020లో అరుణాచల్ ప్రదేశ్‌లోని ఏడుగురు జేడీయూ శాసనసభ్యులలో ఆరుగురు బీజేపీలో చేరారు. గత వారం ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీలో చేరారు.

TS Cabinet Meeting: నేడు కేబినెట్‌ భేటీ.. పలు అంశాలపై మంత్రులకు కేసీఆర్ దిశానిర్దేశం

మణిపూర్‌లో ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ పోటీ చేసిన 38 నియోజకవర్గాల్లో ఆరు స్థానాలను గెలుచుకుంది. కాగా ప్రస్తుతం జేడీయూ ఎమ్మెల్యేలైన జోయ్‌కిషన్ సింగ్, ఎన్ సనాతే, ఎండీ అచాబ్ ఉద్దీన్,ఎల్‌ఎం ఖౌటే, తంజామ్ అరుణ్‌కుమార్‌ బీజేపీలో చేరారు. ఎల్‌ఎం ఖౌటే, తంజామ్ అరుణ్‌కుమార్‌ గతంలో బీజేపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రయత్నించారు. కానీ పార్టీ తిరస్కరించిన తర్వాత జేడీయూలో చేరి.. విజయం సాధించారు. నితీష్ కుమార్ బీజేపీని వదిలిపెట్టి రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్, ఇతర పార్టీలతో జతకట్టిన వారాల తర్వాత ఈ చర్య జరగడం గమనార్హం. మార్చిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 60 మంది సభ్యుల రాష్ట్ర అసెంబ్లీలో 32 సీట్ల మెజారిటీని సాధించింది. దాని ఫలితాలు మార్చి 10న ప్రకటించబడ్డాయి

Exit mobile version