NTV Telugu Site icon

Manish Sisodia: 17 నెలల తర్వాత భార్యతో కలిసి చాయ్ తాగిన మనీష్ సిసోడియా

Manish

Manish

Manish Sisodia: ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణం కేసులో అరెస్టై పది హేడు నెలల తర్వాత తీహార్‌ జైలు నుంచి రిలీజైన మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా ఇంటి జీవితాన్ని ఆస్వాదించడం స్టార్ట్ చేశారు. నిన్న (శుక్రవారం) సాయంత్రం తీహార్‌ జైలు నుంచి విడుదలైన సిసోడియా ఇవాళ (ఆగస్టు10) ఉదయం ఇంట్లో తన భార్యతో కలిసి టీ తాగుతూ తీసుకున్న సెల్ఫీ ఫోటోను ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్టు చేశారు.

Read Also: Telangana Crime: క్షణికావేశం.. ఒకరు కొడుకును చంపితే.. మరొకరు తండ్రిని హతమార్చాడు..

ఈ సందర్భంగా ‘17 నెలల తర్వాత.. ఫస్ట్‌ మార్నింగ్‌ టీ ఆఫ్‌ ఫ్రీడమ్‌ అంటూ ఎక్స్ వేదికగా తన భార్యతో కలిసి దిగిన ఫోటోను మనీష్ సిసోడియా షేర్ చేశారు. భారతీయులందరికీ రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కు నుంచి వచ్చిందే ఈ స్వేచ్ఛ అని తన సిసోడియా భావోద్వేగపూరిత కామెంట్స్‌ జోడించారు. అయితే, గత ఏడాది ఫిబ్రవరి 26వ తేదీన లిక్కర్‌స్కామ్‌ కేసులో అరెస్టైన సిసోడియాకు శుక్రవారం సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో ఆయన 17 నెలల పాటు జైలు జీవితం గడిపిన తర్వాత విడుదలయ్యారు.

Show comments