Site icon NTV Telugu

Wipro: కీలక ఉద్యోగిని తొలగించిన విప్రో.. కారణం ఇదే..

Rishad Premji

Rishad Premji

Fired Top Leader In 10 Minutes says Wipro Boss: సంస్థ సమగ్రతకు భంగం వాటిల్లేలా ఎవరు ప్రయత్నించినా వదిలేది లేదంటోంది ప్రముఖ టెక్ దిగ్గజం విప్రో. ఇటీవల 300 మంది ఉద్యోగులను తొలగించి వార్తల్లో నిలిచింది. సంస్థలో పనిచేస్తూనే వేరే కంపెనీలకు పనిచేస్తూ ‘‘ మూన్ లైటింగ్’’కు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుని సంచలనం సృష్టించింది. విప్రో బాస్ రిషద్ ప్రేమ్ జీ మూన్ లైటింగ్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీన్ని మోసంగా అభివర్ణిస్తున్నారు ఆయన.

ఇదిలా ఉంటే ‘‘ సమగ్రత ఉల్లంఘన’’కు పాల్పడిన ఓ కీలక ఉద్యోగిని 10 నిమిషాల్లోనే తొలగించినట్లు రిషద్ ప్రేమ్ జీ వెల్లడించారు. ఈ విషయంలో సీనియర్ ఉద్యోగులకు కూడా మినహాయింపు లేదని ఆయన అన్నారు. విప్రోలో టాప్ 20 మంది ఉద్యోగుల్లో ఒకరిని తొలగించేందుకు కేవలం 10 నిమిషాల్లోనే నిర్ణయం తీసుకున్నామని అన్నారు. సదరు ఉద్యోగి సంస్థ కోసం పనిచేయడం ముఖ్యమని.. కానీ సమయం కఠినంగా ఉన్నప్పడు.. మీరు కూడా కఠినంగా పనిచేయాల్సి ఉంటుందని విప్రో బాస్ రిషద్ ప్రేమ్ జీ అన్నారు. అక్టోబర్ 19న బెంగళూర్ లో జరిగిన నాస్కామ్ ప్రొడక్ట్ కాన్‌క్లేవ్‌లో ప్రేమ్‌జీ మాట్లాడారు.

Read Also: Munugode Symbols: ఢిల్లీకి మునుగోడు గుర్తుల పంచాయతీ.. వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశం

అయితే ఇది మూన్ లైటింగ్ వల్ల జరిగిందా..? అనేది ప్రేమ్ జీ వెల్లడించలేదు. అయితే గతంలో 300 మంది ఉద్యోగుల తొలగింపు సంస్థ నియమాలను ఉల్లంఘించడం వల్లే జరిగాయని ఆయన చెప్పారు. 300 మంది మూన్ లైటింగ్ కు పాల్పడుతున్న ఉద్యగులను ఒకేసారి తొలగించడంపై విప్రోపై విమర్శలు వెల్లువెత్తాయి. దీని తర్వాత ఇన్ఫోసిస్, ఐబీఎం సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా తమ ఉద్యోగులను హెచ్చరించాయి.

Exit mobile version