Site icon NTV Telugu

Maharashtra: మహారాష్ట్రలో రైలు ప్రమాదం.. మంటల్లో 5 కోచ్‌లు దగ్ధం..

Maharashtra

Maharashtra

Maharashtra: మరో రైలు ప్రమాదానికి గురైంది. మహారాష్ట్రలో అహ్మద్ నగర్ నుంచి అష్టికి వెళ్లే సబర్బన్ ట్రైన్ అగ్నిప్రమాదానికి గురైంది. రైలులోని 5 కోచులకు మంటలు అంటుకున్నాయని అధికారులు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. మంటల ధాటికి కోచులు పూర్తిగా దగ్ధమవుతున్నాయి. అయితే మంటలు వ్యాపించడానికి ముందే రైలులోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు దించేశారు. ప్రస్తుతానికి గాయాలు, ప్రాణనష్టం గురించిన సమాచారం లేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ముందుగా గార్డ్ సైడ్ బ్రేక్ వ్యాన్ లో మంటుల చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వెంటనే పక్కనే ఉన్న నాలుగు కోచులకు మంటలు వేగంగా వ్యాపించాయని, మంటలు చుట్టుముట్టే ముందే ప్రయాణికులను సురక్షితంగా రక్షించారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఇతర బోగీలకు అంటుకోకుండా అడ్డుకున్నారు. దౌండ్ నుంచి రైల్వే యాక్సికెండ్ రిలీఫ్ ట్రైన్, రెస్క్యూ టీం సహాయం అందించడానికి సంఘటన స్థలానికి పంపబడ్డాయి.

Exit mobile version