బడ్జెట్ హైలైట్స్
లోక్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. 4 వ సారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్. కరోనా సంక్షోభ సమయంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోంది. పేద మధ్యతరగతి సాధికారితకు ప్రభుత్వం పనిచేస్తోంది.
వచ్చే 25 ఏళ్ళ పురోగతికోసం బడ్జెట్. ప్రపంచంలోనే వేగంగా పురోగతి సాధిస్తున్న భారత్. నాలుగు ప్రధాన సూత్రాల ఆధారంగా బడ్జెట్. ప్రధాని గతిశక్తి యోజన, సమీకృత అభివృద్ధి, అభివృద్ధి ఆధారిత ఉపాధి, ఉద్యోగ కల్పనపరిశ్రమలకు ఆర్థిక ఊతం.
పీఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్… దేశ ఆర్థిక వ్యవస్థకు నూతన దిశానిర్దేశం. 14 రంగాల్లో మంచి అభివృద్ధి కనిపించింది. వచ్చే ఐదేళ్లలో 13 లక్షల కోట్ల ఉత్పాదకతకు తగిన ప్రోత్సాహకాలు అందిస్తాం. నీలాంచల్ నిస్పాత్ నిగమ్ లిమిటెడ్‌ను ప్రైవేటుపరం చేశాం. త్వరలో ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూ రాబోతుంది.
వచ్చే 25 ఏళ్ల అమృతకాలానికి ఈ బడ్జెట్ పునాది. పారదర్శకమైన సమీకృత అభివృద్ధికి ఈ బడ్జెట్ నాంది. డీబీటీ ద్వారా పేదలకు నేరుగా ఆర్థికసాయం లభిస్తుంది. గృహనిర్మాణం, వసతుల కల్పన, తాగునీరు కల్పనలో దేశం వేగంగా ముందుకెళ్తోంది. ఆజాదీ కా అమృతోత్సవ్ పరుగు ప్రారంభమైంది. వచ్చే 25 ఏళ్లు భారత్‌ను అగ్రదేశంగా నిలబెట్టేందుకు ప్రణాళికలు. ప్రజల ప్రాణాలను కాపాడటంలో టీకా కీలకపాత్ర పోషించింది. ఈ అమృతకాల బడ్జెట్ యువత, మహిళలు, రైతులు, ఎస్సీ, ఎస్టీలకు గొప్ప ఊతమివ్వబోతోంది.
నేషనల్ హైవేస్ నెట్ వర్క్ 25 వేల కిలోమీటర్లు పెంచుతాం. ఇందుకోసం 20 వేల కోట్లు సమీకరిస్తున్నాం. ఆత్మ నిర్బర్ భారత్ లో భాగంగా ఉద్యోగావకాశాలు పెంచాం.
పర్వతమాల ప్రాజెక్టు కింద పర్యావరణ హితమైన అభివృద్ధి చేస్తాం. కొండ ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి తగినంత అవకాశాలు. పర్వతమాల ప్రాజెక్టులో 8 రోప్‌వేల అభివృద్ధి.
దేశంలో నాలుగుచోట్ల మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేస్తాం. మల్టీమోడల్ కనెక్టివిటీలో భాగంగా రైల్వేలతో ఇతర రవాణా సదుపాయాల అనుసంధానం చేస్తాం. వచ్చే మూడేళ్లలో వంద కార్గో టెర్మినళ్ల ఏర్పాటు.
చిరుధాన్యాల అభివృద్ధికి అదనపు ప్రోత్సాహం. 2023ను తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించాం. వంటనూనెల కోసం దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా ఉత్పత్తి. పీపీపీ మోడల్‌లో ఆహార శుద్ధి పరిశ్రమలకు ప్రోత్సాహం. రసాయన రహిత వ్యవసాయ అభివృద్ధికి మరింత ప్రోత్సాహంసేంద్రీయ ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం.
వచ్చే 3 ఏళ్ళలో 400 న్యూజనరేషన్ వందే భారత్ రైళ్ళు. నదుల అనుసంధానానికి బడ్జెట్ లో ప్రోత్సాహం. యాప్ లో అందుబాటులోకి బడ్జెట్ ప్రసంగం.
వేగంగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ. రైల్వేల్లో వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ లో భాగంగా వ్యాపారులకు ప్రయోజనం కలిగించే పథకం. వ్యవసాయరంగానికి బడ్జెట్లో ప్రాధాన్యత.
ఎంఎస్‌ఎంఈలకు మార్కెటింగ్ సహకారం కోసం నూతన పోర్టల్. ఎంఎస్‌ఎంఈల ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక ప్లాట్‌ఫాం.పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి కోసం అదనపు నిధులు. ప్రత్యేక వ్యవస్థలు. ఉద్యోగులు, కార్మికుల్లో నైపుణ్యాభివృద్ధి కోసం ఆన్‌లైన్‌లో నేర్చుకునేందుకు అవకాశాలు. ప్రతి రాష్ట్రంలో కొన్ని ప్రత్యేక ఐటీఐల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటుచేస్తామన్నారు నిర్మలా సీతారామన్.
వృద్ధి రేటు 9.2 శాతంగా నిర్ణయించాం. ప్రధాని ఈ-విద్య కార్యక్రమం కింద టెలివిజన్ ఛానళ్లు 12 నుంచి 200కు పెంపు.
డ్రోన్ల సాయంతో పంట పొలాలకు పరీక్షలు. రక్షణ. డిజిటల్ హెల్త్ సిస్టమ్ కు ప్రోత్సాహం. మానసిక ఆరోగ్యం కోసం పథకం. డిజిటల్ బ్యాంకింగ్ కి ప్రోత్సాహం.
ఈ స్టడీకి బడ్జెట్ లో ప్రోత్సాహం. మినిమం గవర్నమెంట్.. మ్యాగ్జిమం గవర్నెన్స్ విధానం మా లక్ష్యం. దేశవ్యాప్తంగా జిల్లాల వారీ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రత్యేక అభివృద్ధి పథకం.
డిజిటల్ చెల్లింపులు, డిజిటల్ బ్యాంకింగ్‌కు ఈ ఏడాది కూడా మరింత ప్రోత్సాహం. 1.5 లక్షల పోస్టాఫీసుల ద్వారా ఆన్‌లైన్ బ్యాంకింగ్, నెట్‌బ్యాంకింగ్, ఏటీఎం సేవలు. పీఎం ఆవాస్ యోజన కింద 80 లక్షల ఇళ్ళ నిర్మాణం. మహిళా, శిశు సంక్షేమం కోసం మిషన్ శక్తి, వాత్సల్య, సక్షం అంగన్‌వాడీల రూపకల్పన. గత రెండేళ్లలో నల్‌సే జల్ కింద 5.7కోట్ల కుటుంబాలకు లబ్ధి.
ఈ పాస్ పోర్ట్ పథకం. దేశ పౌరులకు సులభంగా పాస్ పోర్ట్ పొందే అవకాశం. 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ సేవా కేంద్రాలు. పట్టణ ప్రాంతాల్లో ప్రజా రవాణా వ్యవస్థ కు ఊతం. చిప్ ఆధారిత పాస్ పోర్టులు.
వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ విధానం అమలు. ప్రజలకు అందుబాటులో రిజిస్ట్రేషన్ ఆఫీసులు. దేశంలో ఎక్కడైనా ఆస్తుల రిజిస్ట్రేషన్. నగరాలు, పట్టణాల అభివృద్ధికి నూతన పట్టణ ప్రణాళిక. నగరాల్లో ప్రయాణ సౌకర్యాల అభివృద్ధి. పట్టణాలు, నగరాల్లో నిర్మాణరంగంలో సంస్కరణలు. పట్టణ ప్రణాళిక అభివృద్ధికి ప్రత్యేక కోర్సులు, సిలబస్.
పట్టణాల్లో పర్యావరణ పరిరక్షణకు డీజిల్, పెట్రోల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలువిద్యుత్ వాహనాల పెంపులో బ్యాటరీల అభివృద్ధికి మరిన్ని ప్రోత్సాహకాలు.
ఐఆర్ డీ ఏ ద్వారా ఇన్స్యూరెన్స్ కంపెనీలకు బాండ్లు. 5 జీ టెక్నాలజీకి ఊతం. టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు. 2022-23లో ప్రైవేటు సంస్థల ద్వారా 5జీ సాంకేతికత ప్రవేశపెడుతున్నాం. 2022-23లో భారత్ నెట్ ప్రాజెక్టు ద్వారా పీపీపీ పద్ధతిలో మారుమూల ప్రాంతాలకు కూడా ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్.
బడ్జెట్ లో మహిళల కోసం 4 ప్రత్యేక పథకాలు. సెజ్ ల కోసం ప్రత్యేక విధానం.దేశంలో దిగుమతులు తగ్గించి భారత ఉత్పత్తుల ప్రోత్సాహానికి ఆత్మనిర్భర భారత్ విధానం. ఎఐ, డ్రోన్లు, సెమీ కండక్టర్లు, సమగ్రావృద్ధికి ఊతం. యువతకు ఉపాధి అవకాశాలు.
ఎలక్ట్రానిక్ వేస్ట్. ఫార్మా పరిశ్రమల కాలుష్యం నివారణకు చర్యలు. విద్యాసంస్థలు, పరిశోధన సంస్థలు, ప్రభుత్వ సంస్థల మధ్య బలమైన అనుసంధానంవిద్యా, పారిశ్రామిక అనుసంధానం ద్వారా నూతన ఆవిష్కరణలకు శ్రీకారం.
డీఆర్‌డీఓ, ఇతర రక్షణ పరిశోధన సంస్థల భాగస్వామ్యంతో ప్రైవేటు సంస్థలకు అవకాశం కల్పిస్తాం. రక్షణ ఉత్పత్తుల దిగుమతులు తగ్గించి స్వయంసమృద్ధి సాధించేలా కృషి.
నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు ద్వారా వివాదాల పరిష్కారం.
డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కు ప్రాధాన్యత. రక్షణ శాఖలో 25 శాతం వ్యయం ప్రైవేట్ పరం.
సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. దీని ద్వారా వ్యయం తగ్గడమే కాదు దుర్వినియోగం తగ్గుతుంది. కరెన్సీ కార్యకలాపాల నిర్వహణలో డిజిటల్ కరెన్సీ రూపకల్పనరాష్ట్రాలకు క్యాపిటల్ మేనేజ్ మెంట్. రాష్ట్రాలకు లక్ష కోట్ల సాయం. ప్రత్యేక నిధి ద్వారా రాష్ట్రాలకు రూ.లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు.
ట్యాక్స్ రిటర్న్స్ అప్ డేట్ చేసేందుకు రెండేళ్ళ సమయం. రిటర్న్స్ లో లోపాల సవరణకు ట్యాక్స్ పేయర్స్ కు అవకాశం.
సహకార సంస్థలకు సాయం. కో ఆపరేటివ్ సొసైటీల సర్ ఛార్జి 12 శాతం నుంచి 7 శాతం తగ్గింపు. ఆదాయం పెంచేందుకు సహకారం.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పీఎఫ్ విధానంలో మార్పులు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌పీఎస్ డిడక్షన్. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా 10 నుంచి 14 శాతానికి పెంపు.
క్రిప్టో కరెన్సీలకు పన్ను రాయితీ లేదు. 30 శాతం పన్ను విధింపు. స్టార్టప్ లకు పన్ను మినహాయింపు మరో ఏడాది పెంపు. కొత్తగా ఏర్పాటయ్యే దేశీయ కంపెనీలకు పన్ను రాయితీలు. మేకిన్ ఇండియాకు చేయూత.
జీఎస్టీతో ఒకే దేశం ఒకే పన్ను అన్న కల నెరవేరింది. దేశంలో జీఎస్టీలో ఇప్పటివరకు కొన్ని సమస్యలు ఉన్నా సవ్యదిశలోనే ముందుకు సాగుతున్నాం.
2022 జనవరిలో జీఎస్టీ వసూలు రూ.1.43 లక్షల కోట్లు. జీఎస్టీ ప్రవేశ పెట్టినప్పటి నుంచి ఇదే అత్యధిక ఆదాయం. దీంతో ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం చెందింది అనేందుకు ఇదే ఉదాహరణ.
బయటపెట్టని ఆదాయం, సోదాల్లో దొరికినప్పుడు కఠినమైన చర్యలు. ఎలాంటి చట్టాల నుంచి కూడా మినహాయింపు లేకుండా చర్యలు తీసుకుంటాం.
జెమ్స్ జ్యూయలరీలకు చేయూత. కస్టమ్స్ డ్యూటీ 5 శాతానికి తగ్గింపు. కెమికల్స్ పై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు.
స్వయం సమృద్ధిలో భాగంగా కస్టమ్స్ సుంకాల హేతుబద్ధత. స్థానిక పరిశ్రమలకు నష్టం కలగకుండా కస్టమ్స్ సుంకాల హేతుబద్ధీకరణ. మౌలిక సదుపాయాల కల్పనలో ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా కస్టమ్స్ సుంకాల హేతుబద్ధీకరణ చేశాం.
కేంద్ర బడ్జెట్ అనంతరం వాయిదా పడిన లోక్ సభ. ఈ బడ్జెట్ లో వేతనజీవులకు నిరాశ. ఆదాయపు పన్ను మినహాయింపులు లేకుండానే ముగిసిన ప్రసంగం.