Site icon NTV Telugu

BIG Breaking: ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రికి నిర్మలా సీతారామన్‌..?

Nirmala Seeta Raman

Nirmala Seeta Raman

finance minister sitharaman to aiims: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. సోమవారం మధ్యాహ్నం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆమెను ఆసుపత్రికి వెళ్లారు. నిర్మలా సీతారామన్ ఆదివారం మాజీ ప్రధాని, బీజేపీ దిగ్గజ నేత వాజ్‍పేయీ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఇవాళ ఆమె ఆరోగ్య పరీక్షల కోసం ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లడంతో ప్రముఖులు ఫోన్‌ చేసి ఆమె ఆరోగ్యంపై క్షేమ సమాచారం తెలుసుకుంటున్నారు. అయితే ఆమె పరిస్థితి బాగాలేదని, అస్వస్థతకు గురయ్యారని వస్తున్న వార్తలపై నిర్మలా సీతారామన్ స్పందించలేదు. ఆరోగ్య పరీక్షలకు ఆమె ఎయిమ్స్ కు వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. ఆమె ఆరోగ్య పరిస్థితి పై పూర్తీ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read also: Cock Fights: కోడిపందాలపై ఆంక్షలు…పశ్చిమ గోదావరి ఎస్పీ వార్నింగ్

నిర్మలా సీతారామ‌న్ 2008 లో బీజేపీలో చేరారు. 2014 లో న‌రేంద్ర మోడీ కేబినెట్‌లో చేర‌క ముందు ఆమె పార్టీ అధికార ప్ర‌తినిధిగా సేవ‌లందించారు. ఆమె 2014 లో ఒక‌సారి, 2016 లో మ‌రోసారి రాజ్యస‌భ స‌భ్యురాలిగా ఎన్నిక‌య్యారు. నిర్మలా ప్రస్తుతం ఇందిరాగాంధీ అనంత‌రం దేశానికి రెండో మ‌హిళా ర‌క్షణ మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె కేంద్ర ఆర్థిక మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు.
Adivi Sesh: ఆమెతో అడివి శేష్ ఎఫైర్.. మరోసారి బట్టబయలు..?

Exit mobile version