Site icon NTV Telugu

Union Budget 2024: జూలై 23న మోడీ సర్కార్ బడ్జెట్.. ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్..

Nirmala Seetaraman

Nirmala Seetaraman

Union Budget 2024: మూడో సారి అధికారంలో వచ్చిన మోడీ సర్కార్ జూలై 23న కేంద్ర బడ్జెట్‌ని ప్రవేశపెట్టబోతోంది. 2024-25 సంవత్సరానికి గానూ పూర్తి బడ్జెట్‌ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కి సమర్పించనున్నారు. దీనికి ఒక రోజు ముందుగానే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతాయని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు శనివారం ప్రకటించారు.

సార్వత్రిక ఎన్నికల సంవత్సరం కావడంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వరసగా ఏడవసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నిర్మలా సీతారామన్, మొరార్జీ దేశాయ్ పేరుతో ఉన్న రికార్డును అధిగమించబోతున్నారు.

Exit mobile version