Site icon NTV Telugu

గుడ్ న్యూస్ : భారత్‌లోకి త్వరలో ఫైజర్‌ టీకా

అతి త్వరలోనే భారత్‌లోకి ఫైజర్‌ టీకా రానుంది. ఈ మేరకు ఆ సంస్థ సీఈఓ ఆల్బర్ట్‌ బౌర్లా కీలక ప్రకటన చేశారు. అత్యవసర వినియోగం కింద మరికొన్ని రోజుల్లోనే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందన్నారు ఆల్బర్ట్‌ బౌర్లా. ఇందుకు సంబంధించిన అనుమతుల ప్రక్రియ తుదిదశకు చేరుకుందని చెప్పారు. భారత్‌లో ఇప్పటికే మూడు వ్యాక్సిన్‌లు వినియోగంలో ఉన్నప్పటికీ వ్యాక్సిన్‌ల కొరత వేధిస్తోంది. దీంతో విదేశీ టీకాలకు అనుమతి ఇవ్వడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చని కేంద్రం భావిస్తోంది.

read also : ఇండియాలో 3 కోట్లు దాటిన కరోనా కేసులు..

కాగా.. దేశంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో 50,848 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,00,28,709 కి చేరింది. ఇందులో 2,89,94,855 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 6,43,1941 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక‌, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 1,358 మంది మృతి చెందారు.

Exit mobile version