Filmmaker Cheating: ఓ సినీ నిర్మాత తాను వేరే మహిళతో ఉండటాన్ని గుర్తించిన భార్యను కారుతో ఢీకొట్టాడు. సినీ నిర్మాత కమల్ కిషోర్ మిశ్రా వాహనంలో మరో మహిళతో ఉండటాన్ని గమనించిన తన భార్యపైకి తన కారును ఎక్కించపోయాడనే ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఈ ఘటన ముంబయిలోని అంబోలీ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. సబర్బన్ అంధేరి (పశ్చిమ)లోని నివాస భవనం పార్కింగ్ ప్రాంతంలో అక్టోబర్ 19న జరిగిన ఈ ఘటనలో కమల్ మిశ్రా భార్య గాయపడినట్లు పోలీసు అధికారి తెలిపారు.
ముంబయికి చెందిన సినీ నిర్మాత కమల్ కిషోర్ మిశ్రాకు వివాహమైది. ఇటీవల ఒక రోజు అతడు ఇంట్లో కనిపించకపోయే సరికి.. భార్య అతని కోసం వెతుక్కుంటూ వెళ్లింది. ఈ క్రమంలో పార్కింగ్ ప్రదేశంలో కారులో అతన్ని గుర్తించింది. అయితే అతనితోపాటు మరో మహిళ ఉండటాన్ని చూసి దగ్గరకెళ్లి నిలదీసింది. తన భార్యను తప్పించుకునే క్రమంలో ఎదురుగా ఉన్న ఆమెను పట్టించుకోకుండా కమల్ తన కారును వేగంగా ముందుకు పోనిచ్చాడు. ఈ క్రమంలో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. పక్కన ఉన్న పలువురు ఆమెను కాపాడి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితురాలు తన భర్తపై ఫిర్యాదు చేయగా.. నిర్మాతపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. హిందీలో ‘దేహతి డిస్కో’ చిత్రానికి కమల్ మిశ్రా నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
https://twitter.com/ANI/status/1585294131970334720
