Site icon NTV Telugu

Honeymoon Murder Case: సినిమాగా హనీమూన్ మర్డర్ కేసు.. దర్శకుడికి గ్రీన్‌సిగ్నల్

Honeymoon Murder Case

Honeymoon Murder Case

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీమూన్ మర్డర్ కేసు ఇప్పుడు సినీ తెరపైకి రానుంది. ఇందుకోసం బాధిత కుటుంబం అనుమతి ఇచ్చింది. అసలేం జరిగిందో ప్రజలకు తెలియాలనే సినీ దర్శకుడికి అనుమతి ఇచ్చినట్లు రాజా రఘువంశీ సోదరుడు మీడియాకు తెలిపాడు.

హనీమూన్ మర్డర్ కేసును సినిమాగా తీసేందుకు ప్రముఖ సినీ దర్శకుడు ఎస్పీ నింబావత్‌‌కు బాధిత కుటుంబం అనుమతి ఇచ్చింది. ఇక దర్శకుడు నింబావత్ సినిమా టైటిల్ ఖరారు చేశారు. ‘‘హనీమూన్ ఇన్ షిల్లాంగ్’’ అనే టైటిల్ పెట్టారు. బాధితుడు రాజా కుటుంబ నేపథ్యం, వివాహం, హత్యకు దారి తీసిన పరిణామాలు, భార్య, ఆమె ప్రియుడు పన్నిన కుట్ర, అనంతరం పోలీసుల దర్యాప్తు, నిందితుల అరెస్ట్‌కు దారి తీసిన పరిణామాలు అన్నీ ఈ చిత్రంలో రూపుదిద్దుకోనున్నాయి. 80 శాతం షూటింగ్ ఇండోర్‌లోనే జరగనుంది.

రాజా సోదరుడు సచిన్ మీడియాతో మాట్లాడుతూ.. రాజా హత్య వెనుక అసలేం జరిగిందో ప్రజలకు తెలియాలన్నారు. సమాజానికి అర్థం కావడం కోసమే సినిమా తీసేందుకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. ఈ సంఘటనలో ఎవరిది తప్పు.. ఎవరిది సరైందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మరో సోదరుడు విపన్ మాట్లాడుతూ.. చిత్రం ద్వారా నిజాన్ని చూపించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. దర్శకుడు నింబవత్ సినిమా ద్వారా సమాజానికి ఒక హెచ్చరికగా ప్రజలకు సందేశం పంపించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ఇది కూాడా చదవండి: Trump: దగ్గర పడ్డ ట్రంప్ డెడ్‌‌లైన్.. భారత్‌‌కు తాజా హెచ్చరిక ఇదే

ఇక దర్శకుడు నింబవత్ మాట్లాడుతూ.. స్క్రిప్ట్ పూర్తయిందన్నారు. 80 శాతం చిత్రీకరణ ఇండోర్‌లోనే జరుగుతుందన్నారు. 20 శాతం షూటింగ్ మాత్రం మేఘాలయలోని వివిధ ప్రాంతాల్లో చిత్రీకరిస్తామని చెప్పారు. ఇక నటీనటుల వివరాలను మీడియాకు వెల్లడించడానికి నింబవత్ ఇష్టపడలేదు.

ఇది కూాడా చదవండి: Mega Star : చిరు – బాబీ సినిమాకు డీఓపీగా టాలీవుడ్ యంగ్ దర్శకుడు

మే 11న యూపీకి చెందిన సోనమ్ రఘువంశీతో ఇండోర్‌కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీ  వివాహం జరిగింది. ఈ వివాహం ఎంతో గ్రాండ్‌గా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు.. ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే హనీమూన్ కోసం అని నూతన దంపతులు మే 20న మేఘాలయకు వెళ్లారు. అయితే మే 23న సోనమ్ రఘువంశీ హంతక ముఠాతో కలిసి భర్త రాజాను అత్యంత దారుణంగా చంపేసి లోయలో పడేసింది. అనంతరం ప్రియుడు రాజ్ కుష్వాహా‌తో కలిసి పారిపోయింది. ఇక జూన్ 2న రాజా మృతదేహం లభించింది. హత్యకు గురైనట్లుగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం జూన్ 8న అనూహ్యంగా సోనమ్ పోలీసుల ఎదుట లొంగిపోయింది. దీంతో హనీమూన్ మర్డర్ కేసు వెలుగులోకి వచ్చింది. భార్యనే భర్తను చంపేసిందని తెలియగానే దేశమంతా ఒక్కసారిగా షాక్‌కు గురైంది. సోనమ్, ఆమె ప్రియుడు, హంతక ముఠా ప్రస్తుతం జైల్లో ఉన్నారు. మొత్తం ఈ కథంతా త్వరలో తెరపైకి రానుంది. రాజా స్థానంలో హీరో ఎవరో.. సోనమ్ స్థానంలో హీరోయిన్ ఎవరో ఇంకా వివరాలు రాలేదు. దర్శకుడు.. హనీమూన్ మర్డర్ కేసును ఎలా మలుస్తారో చూడాలి.

నింబావత్…
ఎస్పీ నింబావత్ సినీ దర్శకుడు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాల్లో ‘‘హైజాక్’’ (2008), ‘‘మమ్మీ పంజాబీ’’, సూపర్‌మ్యాన్ కి భీ మా!‘‘(2011), ‘‘తెరే బిన్ లాడెన్ డెడ్ ఆర్ అలైవ్’’ (2016), ‘‘కబడ్డీ’’ (2018) చిత్రాలు ఉన్నాయి.

Exit mobile version