Site icon NTV Telugu

ఫిబ్రవరి 1నవిద్యుత్‌ ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె

విద్యుత్ సవరణ బిల్లు 2021కి వ్యతిరేకంగా ఫిబ్రవరి 1న దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నట్టు ఢిల్లీలో జరిగిన ఆల్‌ ఇండియా విద్యుత్‌ ఉద్యోగులు, ఇంజనీర్స్‌ జాతీయ సమన్వయ కమిటీలు ఈ మేరకు తీర్మనాం చేశాయి. విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా డిసెంబర్ 8న దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించింది. డిసెంబర్ 8న ప్రధాన మంత్రి, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రితో పాటు అన్ని రాష్టాల ముఖ్యమంత్రులకు వినతిపత్రాల అందజేయనున్నట్టు వారు తెలిపారు. విద్యుత్ ఉద్యోగులకు మద్దతు ఇవ్వాలని కోరుతూ డిసెంబర్ 15న జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ స్ట్రీట్ వరకు ర్యాలీ, నిరసన ప్రదర్శనలు చేపడతారు.

డిసెంబర్‌ 15న ర్యాలీలో పాల్గొనాలని అన్ని పార్టీల ఎంపీలకు ఆహ్వానం పంపుతారు. పార్లమెంటులో బిల్లు పెట్టిన సమయంలో అన్ని పవర్ ప్లాంట్లు, సబ్ స్టేషన్లు, విద్యుత్ కార్యాలయాల్లో విధుల్లో బహిష్కరించేలా ప్రణాళికలు చేపడుతున్నారు. బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యోగులు చేస్తున్న కార్యక్రమాలకు అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులు మద్ధతు ఇవ్వాలని కోరారు. పార్లమెంట్‌లో ఈ బిల్లు ప్రవేశపెట్టకుండా చూడాల్సిన బాధ్యత ఎంపీల అందరిపై ఉందని వారు అన్నారు.

Exit mobile version