Site icon NTV Telugu

Pakistan: భారత ‘‘త్రిశూల్’’తో వణికి చస్తున్న పాకిస్తాన్.. రెండోసారి నోటమ్ జారీ..

Trishul 2025 Exercise

Trishul 2025 Exercise

Pakistan: భారతదేశం పెద్ద ఎత్తున త్రివిధ దళాల విన్యాసాలు నిర్వహిస్తోంది. ‘‘త్రిశూల్ 2025’’ ఎక్సర్‌సైజ్ పేరుతో యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తోంది. గుజరాత్ రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతంలో, పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గర త్రివిధ దళాలు పెద్ద ఎత్తున డ్రిల్స్ నిర్వహిస్తున్నాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ మూడు దళాలు కలిసి పాల్గొంటున్నాయి. 20,000 మంది సైనికులతో పాటు T-90S, అర్జున్ ట్యాంకులు, రాఫెల్, సుఖోయ్ యుద్ధవిమానాలు, నేవీ నౌకలు పాల్గొంటున్నాయి. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 11 వరకు పాక్ సరిహద్దుల్లోని సర్‌క్రీక్ వద్ద ఈ మిలిటరీ ఎక్సర్‌సైజ్ జరుగుతోంది.

Read Also: Funds Release : ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. బకాయిలను విడుదల చేసిన ప్రభుత్వం

అయితే, భారత పెద్ద ఎత్తున యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తుండటంతో పాకిస్తాన్ అప్రమత్తమైంది. రెండోసారి నోటమ్(NOTAM) జారీ చేసింది. ఐదు రోజుల్లో పాకిస్తాన్ ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం ఇది రెండోసారి. పాక్ జాగ్రత్త, భయంతో ఈ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. NOTAM (Notice to Airmen) హెచ్చరికలు విమానయాన సంస్థలకు ఇచ్చే హెచ్చరిక. ఈ ప్రాంతం మీదుగా విమానాలు ఎగరొద్దు అనే సమాచారాన్ని దీని ద్వారా ఇస్తారు.

పాకిస్తాన్ నవంబర్ 1 నుంచి 30 వరకు తన దక్షిణ తీర ప్రాంత గగనతలాన్ని మూసేసింది. ఇంటెలిజెన్స్ వర్గాల ప్రకారం.. పాక్ నేవీ లైవ్-ఫైరింగ్ డ్రిల్‌లు, క్షిపణి పరీక్షకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే విధంగా, సరిహద్దుల్లో భారత్ పెద్ద ఎత్తున విన్యాసాలు చేయడంతో భయంతో కూడా నోటమ్ జారీ చేసినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ దక్షిణ వైమానిక స్థావరాలు, సర్ క్రీక్, దాని పరిసర ప్రాంతాల సమీపంలోని నావికా దళాలపై భారత దేశం ఖచ్చితమైన దాడులు ప్రారంభించవచ్చనే అనుమానం పాకిస్తాన్ లో ఉంది. పాకిస్తాన్ తన రక్షణను నవంబర్ 30 వరకు తన దళాలన్నింటిని రెడ్ అలర్ట్‌లో ఉంచినట్లు సమచారం.

Exit mobile version