Site icon NTV Telugu

Funeral Rituals for Daughter : ప్రేమికుడితో వెళ్లిపోయిన యువతి.. బతికుండగానే శవయాత్ర చేసిన తండ్రి

Untitled Design

Untitled Design

ప్రేమ మత్తులో పడి కొందరు యువతీ యువకులు కన్నవారిని వదిలి తమ ప్రియుడు లేదా ప్రియురాలితో వెళ్లిపోతున్నారు. ఇలాంటి ఘటనలు తల్లిదండ్రులకు తీరని వేదనను మిగులుస్తున్నాయి. అలాంటి హృదయవిదారక సంఘటనే మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. తన కూతురు ప్రేమించిన యువకుడితో ఇంటి నుంచి వెళ్లిపోయిందన్న విషయం తండ్రిని తీవ్రంగా కలచివేసింది. దీంతో అతడు బ్రతికి ఉండగానే కూతరు చనిపోయిందని.. ఓ పిండిముద్దతో తన కూతురికి శవయాత్ర నిర్వహించాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే, మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి తన కూతురు కనిపించకపోవడంతో సమీప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ చేపట్టగా, ఆ యువతి ఓ యువకుడిని ప్రేమించి అతడితో వివాహం చేసుకుని వెళ్లిపోయినట్టు గుర్తించారు. ఈ విషయాన్ని పోలీసులు తండ్రికి తెలియజేయడంతో ఆయన తీవ్ర ఆవేశానికి లోనయ్యాడు. సమాజంలో తన కూతురు తనకు లేనట్టే అని భావించిన తండ్రి, కూతురు రూపాన్ని పిండి ముద్దగా తయారు చేయించి, ఆమె చనిపోయినట్టుగా గ్రామస్థులు, బంధువులకు ప్రకటించాడు. అనంతరం ఆమెకు శవయాత్ర కూడా నిర్వహించాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Exit mobile version