BMW M4 Competition: 9వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు.. కొడుకుకు రూ.1.62 కోట్ల లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BMW M4 Competition Gift: పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తే ఖరీదైన బహుమతులు ఇవ్వడం సాధారణమే. అయితే పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త తన 15 ఏళ్ల కుమారుడికి ఏకంగా రూ.1.62 కోట్ల విలువైన BMW M4 Competition కారును బహుమతిగా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. 9వ తరగతి అర్ధ సంవత్సర పరీక్షల్లో మంచి మార్కులు సాధించినందుకు ఈ ఖరీదైన కారును కానుకగా అందించారు.
పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా బర్ధమాన్ జిల్లాలో గల గల్సీ ప్రాంతం పరాజ్ గ్రామానికి చెందిన షంసుద్దీన్ మిద్యా అనే వ్యాపారవేత్త తన కుమారుడు మొహమ్మద్ తల్హాకు ఈ కారును బహుమతిగా ఇచ్చారు. తనకు BMW M4 Competition కారు కావాలని తల్హా చాలాకాలంగా కోరుకుంటున్నాడు. పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తే ఆ కోరిక నెరవేరుస్తానని తండ్రి గతంలో హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఫలితాలు వెలువడిన తర్వాత ముంబైలోని అంధేరీ షోరూమ్‌కు వెళ్లి కారును కొనుగోలు చేశారు.
Also Read
- India New Visa Rules 2026: భారత్‌లో కొత్త వీసా రూల్స్.. 70 శాతం తగ్గనున్న అప్లికేషన్ ఫారాలు, 13 నుంచి 9కి కేటగిరీలు!
- Fertiliser Subsidy for Rabi: రైతులకు కేంద్రం భారీ శుభవార్త.. గతేడాది కంటే 64 శాతం పెంపు
- CM Vijay: ఎమ్మెల్యేలకు సీఎం విజయ్ సీరియస్ వార్నింగ్.. నేడు మరోసారి కీలక భేటీ
- Kareena Kapoor: కరీనా లాకెట్‌పై ఖురాన్ వచనాలు.. కాంగ్రెస్ నేత లీగల్ నోటీసులు!
ప్రత్యేక కంటైనర్‌లో గ్రామానికి చేరిన కారు
ముంబైలో కొనుగోలు చేసిన BMW M4 Competition కారును ప్రత్యేకంగా రూపొందించిన కంటైనర్‌లో పశ్చిమ బెంగాల్‌లోని పరాజ్ గ్రామానికి తరలించారు. నవంబర్ 6, శుక్రవారం గ్రామానికి కారు చేరుకోవడంతో దాన్ని చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కుమారుడి కష్టానికి తగిన బహుమతి ఇచ్చిన తండ్రిని కొందరు ప్రశంసిస్తుండగా, 15 ఏళ్ల వయసులో ఉన్న విద్యార్థికి ఇంత ఖరీదైన కారు బహుమతిగా ఇవ్వడం ఎంతవరకు సమంజసమని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
తండ్రి వద్ద ఇప్పటికే ఖరీదైన కార్ల కలెక్షన్
షంసుద్దీన్ మిద్యా వద్ద ఇప్పటికే పలు లగ్జరీ, ప్రీమియం కార్లు ఉన్నాయి. ఆయన కార్ల కలెక్షన్లో లేటెస్ట్ జనరేషన్ Range Rover Autobiography, Volvo XC90, Mercedes-Benz C-Class, Mahindra Thar Roxx, Hyundai Alcazar ఉన్నాయి. తాజాగా ఈ కలెక్షన్లో BMW M4 Competition కూడా చేరింది.
BMW M4 Competition ప్రత్యేకతలు
జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ BMW అందిస్తున్న అత్యంత శక్తివంతమైన స్పోర్ట్స్ కూపే కార్లలో M4 Competition ఒకటి. ఈ కారులో 3.0 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ ఇన్లైన్ సిక్స్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది గరిష్ఠంగా 530 bhp పవర్‌తో పాటు 650 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ఈ కారు ప్రత్యేకతలు. BMW M4 Competition M xDrive కేవలం 3.5 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.
దీని గరిష్ఠ వేగాన్ని ఎలక్ట్రానిక్ విధానంలో గంటకు 250 కిలోమీటర్లకు పరిమితం చేశారు. డిజైన్ పరంగా కూడా ఈ కారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పసుపు రంగు ఐకాన్లతో కూడిన హెడ్లైట్లు, కార్బన్ ఫైబర్ బానెట్, ఫ్రంట్ స్ప్లిటర్, మిర్రర్ క్యాప్స్, పెద్ద కిడ్నీ గ్రిల్, రియర్ డిఫ్యూజర్ వంటి అంశాలు స్పోర్టీ లుక్‌ను అందిస్తాయి. కారు లోపల ప్రత్యేకమైన M కార్బన్ బకెట్ సీట్లు, ఇతర స్పోర్టీ డిజైన్ ఎలిమెంట్స్ ఉంటాయి.
తాజావార్తలు
-
BMW M4 Competition: 9వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు.. కొడుకుకు రూ.1.62 కోట్ల లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి!
-
Anirudh-Kavya Maran Wedding: ఒక్కటైన అనిరుధ్, కావ్య మారన్.. ఫొటోలు, వీడియోలు వైరల్.. రజనీకాంత్ మాస్ స్టెప్పులు
-
AP Local Body Elections: పంచాయతీ ఎన్నికల నగారా.. నేడు ఎస్ఈసీ కీలక ప్రకటన!
-
Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కి మరోసారి కెప్టెన్‌గా రోహితేనా..? స్టార్ ప్లేయర్ నోరుజారడంతో లీకైన అసలు మ్యాటర్..
-
India Tax Collection: దేశంలో భారీగా పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు.. రూ.14.42 లక్షల కోట్లకు చేరిన నికర ఆదాయం
ట్రెండింగ్
-
Airtel Beats Jio: జియోకు షాకిచ్చిన ఎయిర్టెల్.. బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్, నెట్వర్క్ క్వాలిటీలో నెం.1గా..!
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..