Site icon NTV Telugu

Farmers Protest: నిరుద్యోగంపై రైతుల ఆందోళన.. ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత

Farmers Protest

Farmers Protest

Farmers protest.. Security of Delhi tightened: దేశంలో రైతులు మరోసారి ఆందోళనలకు సిద్ధం అయ్యారు. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన రైతులు ప్రస్తుతం నిరుద్యోగంపై పోరుబాట పట్టారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగంపై సోమవారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ‘మహా పంచాయత్’ కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో రైతులు పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశం ఉంది.  అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఢిల్లీ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

ముఖ్యంగా ఢిల్లీ సరిహద్దుల్లోని హర్యానా సమీపంలోని సింఘు బోర్డర్, టిక్రి బార్డర్ తో పాటు ఉత్తర్ ప్రదేశ్ సరిహద్దుల్లోని ఘాజీపూర్ సరిహద్దుల వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. బారికెడ్లు ఇతర భద్రతను ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం నుంచే వివిధ ప్రాంతాల నుంచి రైతులు ఢిల్లీకి చేరుకుంటున్నారు. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లో అన్ని వాహనాలను తనిఖీ చేస్తున్నారు పోలీసులు. భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేస్ టికాయత్ ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ఓ సమావేశంలో నిరుద్యోగానికి వ్యతిరేకంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు.

Read Also: Advocate Akbar Death Mystery: అడ్వకేట్ అక్బర్ కేసులో ఆమే విలన్ … అసలేం జరిగింది?

ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే రైతు నాయకుడు రాకేష్ టికాయత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి అరెస్టుల వల్ల రైతులు వెనక్కి తగ్గరని టికాయత్ ట్వీట్ చేశారు. బీకేయూ 40 వ్యవసాయ సంఘాల కూటమి. రైతుల సమస్యలు, మద్దతు ధరల విషయంలో పోరాడుతోంది. అయితే గతేడాది ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ మూడు బిల్లులను వెనక్కి తీసుకుంది.

Exit mobile version