farmani naaz shiv bhajan row: శివ్ భజన్ ‘హర్ హర్ శంభు’ను ఆలపించినందుకు ఓ ముస్లిం సింగర్ ని టార్గెట్ చేశాయి పలు ముస్లిం సంఘాలు. యూట్యూబర్ ఫర్మానీ నాజ్ తన యూట్యూబ్ ఛానెల్ కోసం హర్ హర్ శంభు పాటను ఆలపించింది. ఇటీవల ఆ గీతాన్ని విడుదల చేసింది. అయితే ఇప్పుడు ఈ విషయం వివాదాస్పదం అవుతోంది. పలు ముస్లిం సంఘాలు ఫర్మానీ నాజ్ పై మండి పడుతున్నాయి. ఇస్లాంకు వ్యతిరేకంగా పాటను పాడావంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వివాదంపై ఫర్మానీ నాజ్ స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. కళాకారులకు మతం లేదని.. నేను పాడేటప్పుడు అవన్నీ మరిచిపోతాానిన.. నేను ఖవ్వాలి కూడా పాడతానని.. మహ్మద్ రఫీ, మాస్టర్ సలీమ్ భక్తి పాటలు పాడారని.. ఆమె చెప్పుకొచ్చారు. నాకు ఎప్పుడు బెదిరింపులు రాలేదని.. అయితే ఇప్పుడు వివాదం ఏర్పడిందని ఆమె అన్నారు.
దీనిపై కొందరు ముస్లిం ప్రముఖులు స్పందిస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం, ప్రతీ పౌరుడు ఒక మతాన్ని అనుసరించవచ్చని.. అదే సమయంలో ఇతర మతాల మనోభావాలను దెబ్బతీయకూడదని.. అందులో ఎలాంటి సమస్య లేదని ముఫ్తీ జుల్పికర్ అన్నారు. ఇదిలా ఉంటే మహిళలు పాడటం, డ్యాన్స్ చేయడం ఇస్లాంలో అనుమతించబడదని.. ఇలాంటి వాటికి ఫర్మానీ నాజ్ దూరంగా ఉండాలని దేవ్ బంద్ ఉలేమా మౌలానా అసద్ ఖాస్మీ హెచ్చరించారు. మహిళలు పాడటం, డ్యాన్స్ చేయడం ఇస్లాంలో హారామ్ తో సమానం అని ఆయన అన్నారు. ముస్లింల మనోభావాలను కించపరిచినందుకు అల్లాకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Also: Aaditya Thackeray: మహారాష్ట్రను 5 భాగాలుగా విడగొట్టాలని అనుకుంటున్నారు.
అయితే వీటన్నింటిపై ఫర్మానీ నాజ్ స్పందించారు. తనను నిందించడం ఆపాలని కోరారు. ఇటీవల శ్రావణ మాసం ప్రారంభం కావడంతో ఆమె యూట్యూబ్ ఛానెల్ లో ‘హర్ హర్ శంభు’ భక్తి గీతాన్ని ఆలపించి విడుదల చేసింది. ఈ భక్తి పాటపై ఓ వర్గం నుంచి ఫర్మానీ నాజ్ ప్రశంసలు అందుకుంటుంటే.. మరో వర్గం ఆమెను విమర్శిస్తున్నారు. ఫర్మానీ నాజ్ ఉత్తర్ ప్రదేశ్ ముజఫర్ నగర్ కు చెందిన వ్యక్తి. ఈమె 12 వసీజన్ ఇండియన్ ఐడల్ ప్రోగ్రాంలో కూడా పాల్గొన్నారు. కొడుకు పుట్టిన తర్వాత భర్త వదిలేయడంతో యూట్యూబ్ నే ఆదాయంగా మార్చుకుంది. ఆమె యూట్యూబ్ ఛానెల్ కు 3.54 మిలియన్ల ఖాతాదారులు అనుసరిస్తున్నారు.
