Maharashtra: మహారాష్ట్రలో పులులకు కటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసేందుకు నిర్ణయించినట్లు రాష్ర్ట అటవీ శాఖ మంత్రి గణేశ్ నాయక్ స్పష్టం చేశారు. అయితే, పులుల మధ్య ఆవాసం, హద్దుల కోసం ఘర్షణలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ ఘర్షణల్లో గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 13 పులుల చనిపోయాయని తెలిపారు. అటవీ ప్రాంత గ్రామాల్లో ప్రజలపై దాడి చేసి ఈ పులులు చంపేస్తున్నాయని వెల్లడించారు. అయితే, పెరిగిన పులుల దాడులు, వాటి మధ్య జరిగే ఘర్షణల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలను రూపొందించింది.
Read Also: Boat Sink : ఆఫ్రికా నుండి స్పెయిన్ వెళ్తున్న పడవ మునక.. 44 మంది పాకిస్తానీయులు సహా 50 మంది మృతి
ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని పులులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసేందుకు ప్రతిపాదించామని రాష్ర్ట అటవీ శాఖ మంత్రి గణేశ్ నాయక్ వెల్లడించారు. అందుకోసం కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరనున్నట్లు చెప్పాడు. మరోవైపు, కవ్వాలతో పాటు ఇంద్రావతి, తడోబా టైగర్ జోన్లలో పులుల్లో ఆధిపత్య పోరు కొనసాగుతుండడంతో సరిహద్దు దాటి తెలంగాణలోకి ప్రవేశిస్తున్నాయి. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అటవీ సమీపంలోని గ్రామల ప్రజలు అలర్ట్ గా ఉండాలని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు సూచించారు.