Site icon NTV Telugu

Sonam Raghuvanshi: జైల్లో నెలరోజులు పూర్తి చేసుకున్న సోనమ్.. వెలుగులోకి ఆసక్తికర విషయాలు!

Sonam Raghuvanshi

Sonam Raghuvanshi

సోనమ్ రఘువంశీ.. అందరికీ గుర్తుండే ఉంటుంది. అయినా మరిచిపోయే పని చేసిందా?. హనీమూన్ పేరుతో భర్తను మేఘాలయ తీసుకెళ్లి అత్యంత దారుణంగా చంపేసి లోయలో పడేసింది. ఈ ఘటన యావత్తు మహిళా లోకాన్నే కాకుండా.. దేశాన్నే కలవరపాటుకు గురిచేసింది. ఇప్పుడెందుకు ఆమె గురించి అంటారా? భర్తను చంపిన కేసులో సోనమ్ రఘువంశీ జైలుకెళ్లి నెలరోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఇది కూడా చదవండి: Harish Rao: ఒకప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో 10 ఎకరాలు వచ్చేవి.. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది!

సోనమ్ రఘువంశీ షిల్లాంగ్ జైల్లో ఉంటుంది. జైలుకెళ్లి నెలరోజులైంది. కానీ ఆమెలో ఎలాంటి పశ్చాత్తాపం కనబడలేదని జైలు వర్గాలు పేర్కొన్నాయి. జైల్లో తోటి మహిళా ఖైదీలతో చాలా ఉల్లాసంగా.. సంతోషంగా గడుపుతున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. జైలు వాతావరణం ఆమెకు అలవాటు అయిపోయినట్లుగా వర్గాలు తెలిపాయి. ఆమెకు ఎలాంటి చీకు.. చింతలేదని.. ఇతర మహిళా ఖైదీలతో బాగా కలిసి పోయిందని తెలుస్తోంది. ఇక ఆమెకు ఇప్పటి వరకు ఎలాంటి ప్రత్యేక పని అంటూ ఏదీ కేటాయించలేదు. అంతేకాకుండా జైలుకెళ్లి నెలరోజులైనా ఆమెను చూసేందుకు కుటుంబ సభ్యులెవరూ రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కనీసం ఆమె గురించి విచారణ చేసిన దాఖలాలు కూడా లేవని వర్గాలు పేర్కొన్నాయి.

ఇది కూడా చదవండి: Sukumar : సుకుమార్ లెక్కలను ఫాలో అవుతున్న డైరెక్టర్లు..!

ఇక ప్రతి ఉదయం కచ్చితమైన సమయానికి మేల్కొని.. జైలు మాన్యువల్ ప్రకారం నడుచుకుంటోందని వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే హత్యకు సంబంధించిన విషయాలు… అంతేకాకుండా వ్యక్తిగత విషయాలు ఇప్పటి వరకు తోటి ఖైదీలతో గానీ.. జైలు అధికారులతో గానీ పంచుకోలేదు. జైలు వార్డెన్ కార్యాలయం సమీపంలోనే సోనమ్ గది ఉంది. ఇద్దరు మహిళా ఖైదీలతో కలిసి ఉంటుంది. సీసీ కెమెరాల నిఘాతో ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తూనే ఉంటున్నారు. ఆమెకు కుట్టుపని గానీ లేదంటే నైపుణ్య అభివృద్ధికి సంబంధించిన ఇతర పనులు నేర్పించనున్నట్లు వర్గాలు తెలిపాయి. ఆమె ప్రతి రోజూ టీవీ చూసే సౌకరం కూడా ఉన్నట్లుగా వెల్లడించాయి. జైలు నిబంధనల ప్రకారం. సోనమ్‌ను కుటుంబ సభ్యులు కలవడానికి, మాట్లాడటానికి అనుమతి ఉంది. కానీ ఎవరూ ఆమెను సందర్శించలేదని.. కనీసం ఫోన్ కూడా చేయలేదని చెప్పాయి. ఇప్పటికే ఆమె సోదరుడు గోవింద్.. సోనమ్‌తో అన్ని బంధాలు తెంచుకున్నట్లు మీడియా ముఖంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులెవరూ ఆమెను కలవలేదు.

సోనమ్‌కు మే 11న ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీతో వివాహం అయింది. అయితే మే 20న హనీమూన్ పేరుతో మేఘాలయకు తీసుకెళ్లి కిరాయి హంతకులుతో చంపేసి లోయలో పడేసింది. అనంతరం ప్రియుడితో కలిసి పారిపోయింది. జూన్ 2న లోయలో రాజా మృతదేహం లభించింది. ఇక జూన్ 7న పోలీసుల ఎదుట సోనమ్ లొంగిపోయింది. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.

Exit mobile version