West Bengal: బెంగాల్ ‘‘పుష్ప’’ అరెస్ట్.. అభిషేక్ సన్నిహితుడి ఆటకట్టు..
- బెంగాల్ ‘‘పుష్ప’’ జహంగీర్ ఖాన్ అరెస్ట్..
- ఎన్నికల అక్రమాల కేసులో నిందితుడు..
- మమత మేనల్లుడికి అత్యంత సన్నిహితుడిగా పేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫాల్టా ప్రాంతంలో టీఎంసీ బలమైన నేతగా పేరొందిన జహంగీర్ ఖాన్‌ను వెస్ట్ బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్) అరెస్ట్ చేసింది. భారత్- నేపాల్ సరిహద్దు ప్రాంతంలో అతడిని అరెస్ట్ చేశారు. మమతా బెనర్జీ మేనల్లుడు, డైమండ్ హార్బర్ ఎంపీ అయిన అభిషేక్ బెనర్జీకి జహంగీర్ ఖాన్ అత్యంత సన్నిహితుడు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జహంగీర్ ఖాన్ తనను తాను ‘‘పుష్ప’’గా చెప్పుకున్నాడు. ఫాల్టాలో తానే పుష్ప అని తనను ఎవర ఏం చేయలేరని వ్యాఖ్యానించడం ఆ సమయంలో చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉంటే, బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం తర్వాత, ఫాల్టా రీ పోలింగ్ నుంచి తప్పుకున్నట్లు జహంగీర్ ఖాన్ ప్రకటించారు. ఈవీఎంలలో అక్రమాలు, బీజేపీ గుర్తు కనిపించకుండా స్టిక్కర్లు అంటించడంలో ఇతడి పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల తర్వాత ఇతడిపై 5 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో మధ్యంతర రక్షణ పొడగించేందుకు కలకత్తా హైకోర్టు నిరాకరించడంతో అతడిని అరెస్ట్ చేశారు.
Also Read
- Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
ఫాల్టాలో ఎన్నికల అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఆ సమయంలో ఈసీ ఫాల్టా ఎన్నికల్ని రద్దు చేసింది. తర్వాత నిర్వహించిన ఎన్నికల్లో తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు జహంగీర్ ఖాన్ ప్రకటించారు. రీ పోలింగ్‌లో బీజేపీ ఇక్కడ ఘన విజయం సాధించింది. ఎన్నికల సమయంలో ప్రత్యే పరిశీలకుడిగా నియమితులైన ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మకు సవాల్ విసిరారు. ‘‘సింగం’’ పోలీస్ అధికారిగా పేరున్న అజయ్ పాల్‌ను ఉద్దేశిస్తూ జహంగీర్ ఖాన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన సింగం అయితే, తాను పుష్ప అంటూ అభివర్ణించుకున్నాడు. ఫాల్టా రీ పోలింగ్‌లో టీఎంసీ 4వ స్థానానికి పరిమితైంది.
తాజావార్తలు
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తోలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
-
Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!