టెక్నాలజీ పెరిగేకొద్దీ కొత్త కొత్త మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇక ఈజీ మనీ కోసం కొంత మంది అడ్డదారులు కూడా తొక్కుతున్నారు. చట్టాలు వదిలిపెట్టవన్న సంగతి తెలిసి కూడా నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి వచ్చింది. ఏకంగా హర్షవర్ధన్ జైన్(47) అనే వ్యక్తి నకిలీ రాయబార కార్యాలయాన్ని ప్రారంభించి దర్జాగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. మొత్తానికి పాపం పండి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: UK-India: నేడు యూకేతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోనున్న భారత్
హర్షవర్ధన్ జైన్.. ఒకప్పుడు ధనిక కుటుంబం. రాజస్థాన్‌లో విలాసవంతమైన జీవితం జీవించాడు. కుటుంబానికి పాలరాయి వ్యాపారాలు ఉండడంతో ఉన్నంతగా సాగాయి. కానీ ఒక్కసారిగా పరిస్థితులు తల్లకిందులై.. నష్టాలు వచ్చేటప్పటికీ ఆర్థిక స్థితి తారుమారైంది. అంతే ఈజీ మనీ కోసం ఏకంగా ఘజియాబాద్‌లో నకిలీ రాయబార కార్యాలయాన్ని ప్రారంభించి.. లేని దేశాలను సృష్టించి.. ఉద్యోగాలు, కాంట్రాక్ట్‌లు ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడుతున్నాడు. అయితే సోమవారం అర్ధరాత్రి స్పెషల్ పోలీసులు.. నకిలీ రాయబార కార్యాలయంపై దాడి చేయగా మోసాలు బయటపడ్డాయి.
ఇది కూడా చదవండి: Rishabh Pant: బ్యాటింగ్ చేస్తుండగా తీవ్ర గాయం.. నడవలేని స్థితిలో రిషబ్ పంత్! వీడియో
హర్షవర్ధన్ జైన్.. ఘజియాబాద్‌లో ఒక నివాసాన్ని అద్దెకు తీసుకుని విలాసవంతమైన భవనంగా మార్చి.. భారీ స్థాయిలో కార్లు పార్కింగ్ చేసి నానా హంగామాగా కనిపించింది. ఇక నేమ్ ప్లేట్‌ను ‘‘HE HV జైన్’’గా మార్చుకున్నాడు. ‘హిస్ ఎక్సలెన్సీ’గా చలామణి అవుతున్నాడు. ఇలా సంవత్సరాలుగా ఘజియాబాద్‌లో నిశ్శబ్దంగా కార్యకలాపాలు సాగిపోతున్నాయి. అయితే ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) సోమవారం చేసిన నాటకీయ చర్యతో గుర్తింపు లేని సూక్ష్మ దేశాలకు ‘‘రాయబారి’’గా జైన్ చలామణి అవుతున్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. భారతదేశ చరిత్రలోనే ఇది అత్యంత దౌత్యపరమైన కుట్రలో ఒకటిగా పేర్కొన్నారు.
ఇక హర్షవర్ధన్ జైన్ ఘాజియాబాద్‌లోని ఐటీఎస్ కళాశాల నుంచి.. లండన్ కాలేజీ ఆఫ్ అప్లైడ్ సైన్‌లోనూ ఉన్నత విద్యను అభ్యసించి ఎంబీఏ పట్టాలు పొందాడు. అయితే తండ్రిని కోల్పోయాక వ్యాపార ఇబ్బందులు తలెత్తాయి. అనంతరం అతడు వక్రమార్గాన్ని ఎంచుకుని నకిలీ రాయబారిగా మారి మోసాలకు పాల్పడుతున్నాడు. ఇక వివాదాస్పద ఆధ్యాత్మిక వ్యక్తి చంద్రస్వామితో సాన్నిహిత్యం ఉంది. అతని సలహాతో లండన్‌కు వెళ్లడానికి చంద్రస్వామి మద్దతు ఇచ్చాడు. అక్కడ ఉన్నత స్థాయి వ్యాపారవేత్తలు, అంతర్జాతీయ ఆయుధ వ్యాపారి అద్నాన్ ఖషోగ్గితో కలిసిపోయాడు. అనంతరం జైన్.. లండన్, దుబాయ్‌లో అనేక వ్యాపారాలను స్థాపించాడు. లెక్కల్లో లేని నగదు దాచి పెట్టడం.. మనీలాండరింగ్‌కు పాల్పడినట్లుగా కనుగొన్నారు. ఇక చంద్రస్వామి మరణం తర్వాత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న జైన్.. ఘజియాబాద్‌కు తిరిగి వచ్చి ఈ అకృత్యాలకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక వెస్టార్కిటికా, సెబోర్గా, పౌల్బియా, లండనియా వంటి సూక్ష్మ దేశాలకు చెందిన దౌత్య పాస్‌పోర్టులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
