Site icon NTV Telugu

Devendra Fadnavis: “ఉద్ధవ్ మీరు మీ నాన్న వైపు ఉంటారా..?, రాహుల్ గాంధీ వైపా..?

Fadnavis

Fadnavis

Devendra Fadnavis: కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం ఏప్రిల్ 02న లోక్‌సభలో వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టనుంది. సభలో బిల్ పాస్ కావాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, అడ్డుకునేందుకు కాంగ్రెస్, ఇండీ కూటమి సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఇరు పార్టీలు తమ తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. రాబోయే మూడు రోజులు సభకు ఖచ్చితం రావాలని ఆదేశించాయి.

Read Also: Mumbai Indians: హార్థిక్ నుంచి అశ్వని కుమార్ వరకు.. టాలెంట్ ను గుర్తించడంలో ముంబై ఇండియన్స్ తోపు..

ఇదిలా ఉంటే, ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఎంపీలు ఎవరికి మద్దతు ఇస్తారు..? అనే విషయం ఆసక్తికరంగా మారింది. వక్ఫ్ బిల్లు రేపు పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారు అని ఉద్ధవ్ ఠాక్రే ఎవరి వైపు ఉంటారు అని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ‘‘ ఉద్ధవ్ ఠాక్రే తన తండ్రి హిందూ హృదయసామ్రాట్ బాలా సాహెబ్ ఠాక్రే సిద్ధాంతాలు అనుసరిస్తారా..? లేక బుజ్జగింపు రాజకీయాలు చేసే రాహుల్ గాంధీ మార్గంలో వెళ్లారా..?’’ అని ప్రశ్నించారు. లోక్‌సభలో ఠాక్రే సేనకు 09 మంది ఎంపీలు ఉన్నారు.

Exit mobile version