NTV Telugu Site icon

కేంద్రం నిబంధ‌న‌ల‌కు త‌లొగ్గిన ఫేస్‌బుక్

Facebook

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన నిబంధ‌న‌ల‌కు త‌లొగ్గింది ఫేస్‌బుక్.. ప్రజలు స్వేచ్ఛగా, సురక్షితంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయగలిగే వేదికగా ఉపయోగపడేందుకు కట్టుబడి ఉన్న‌ట్టు ప్ర‌కటించింది.. ఫిబ్రవరిలో ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించేందుకు కృషి చేస్తున్నామ‌ని తెలిపింది.. అయ‌తే, మ‌రికొన్ని నిబంధనలపై చర్చ జరుగుతోందని.. ఈ విషయంలో ప్రభుత్వంతో మరిన్ని సమావేశాలు జ‌ర‌గ‌వ‌ల‌సి ఉంద‌ని వెల్ల‌డించింది.. కాగా, కేంద్ర ప్ర‌భుత్వ కొత్త మార్గదర్శకాల ప్రకారం సామాజిక మాధ్యమాల సంస్థలు చీఫ్ కాంప్లియెన్స్ అండ్ గ్రీవియెన్స్ ఆఫీసర్స్‌ను నియమించడం వంటి చర్యలను చేపట్టకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తాజాగా హెచ్చ‌రించిన సంగ‌తి తెలిసిందే. దీంతో.. ఐటీ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించడంపై దృష్టిపెట్టినట్లు ఫేస్‌బుక్ ప్ర‌క‌టించింది..