Site icon NTV Telugu

S Jaishankar: విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కు భద్రత పెంపు..

Jaishankar

Jaishankar

S Jaishankar: భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ కు భారీ భద్రత పెంచినట్లు సమాచారం. ఆయన భద్రతా ఏర్పాట్లలో ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ కారును జత చేశారు. ఢిల్లీలోని ఆయన నివాసం చుట్టూ భద్రతా చర్యలు కూడా కఠినతరం చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. కాగా, జైశంకర్‌కు ఇప్పటికే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కమాండోలతో Z-కేటగిరీ భద్రత కొనసాగుతుంది. 24 గంటలూ ఆయనకు రక్షణగా సుమారు 33 మంది కమాండోల బృందం రక్షణగా ఉంటుంది.

Read Also: Prabhas : ‘స్పిరిట్‌’ కోసం దీపిక రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

అలాగే, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో పాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఢిల్లీ సీఎం రేఖ గుప్తా సహా సుమారు 25 మంది బీజేపీ నాయకులకు అదనపు భద్రత కల్పించినట్లు పోలీసులు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన వీఐపీల భద్రతపై ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా సీనియర్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Exit mobile version