NTV Telugu Site icon

Jharkhand: హేమంత్ సోరెన్ కేబినెట్ విస్తరణ.. 11 మంది మంత్రులుగా ప్రమాణం

Jharkhandcabinet

Jharkhandcabinet

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తాజాగా కేబినెట్ విస్తరణ చేశారు. గురువారం 11 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. జేఎంఎం నుంచి ఆరుగురు, కాంగ్రెస్ నుంచి నలుగురు, ఆర్జేడీ నుంచి ఒకరు మంత్రులుగా ప్రమాణం చేశారు. కొత్త ప్రభుత్వంలో జేఎంఎంకు చెందిన హేమంత్ సోరెన్‌తో పాడు ఏడుగురు ఉన్నారు. కొత్తగా చేరిన మంత్రుల్లో జేఎంఎంకు చెందిన స్టీఫెన్ మరాండీ, రాందాస్ సోరెన్, దీపక్ బీరువా, కాంగ్రెస్‌కు చెందిన రాధా కృష్ణ కిషోర్, దీపికా పాండే సింగ్, ఆర్జేడీకి చెందిన సంజయ్ ప్రసాద్ యాదవ్ ఉన్నారు. కేబినెట్‌లో కొత్త వారికే హేమంత్ అవకాశం ఇచ్చారు. రాంచీలోని రాజ్‌భవన్‌లో మంత్రులతో గవర్నర్‌ సంతోష్‌ గంగ్వార్‌ ప్రమాణ స్వీకారం చేయించారు.

ఇది కూడా చదవండి: Minister Sridhar Babu: తెలంగాణకు రూ.2వేల కోట్ల కొత్త పెట్టుబడులు.. పెద్ద సంఖ్యలో పరిశ్రమలు

నవంబర్‌ 23న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జేఎంఎంకు చెందిన కూటమి ఘన విజయం సాధించింది. రాష్ట్రంలో 81 స్థానాలుండగా.. జేఎంఎం 34 చోట్ల విజయం సాధించింది. బీజేపీ 21, కాంగ్రెస్‌ 16, ఆర్జేడీ 4, సీపీఐ(ఎంఎల్‌)(ఎల్‌) రెండు, ఏజేఎస్‌యూపీ, లోక్‌ జనశక్తిపార్టీ (రాం విలాస్‌), జేఎల్‌కేఎం, జేడీయూ చెరో ఒక స్థానం చొప్పున గెలుచుకున్నాయి.

ఇది కూడా చదవండి: Gas vs Electric Geyser: గీజర్ లేదా ఎలక్ట్రిక్ గీజర్ లలో ఏది ఉత్తమమైంది

నవంబర్ 28న జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ ప్రమాణం చేశారు. గవర్నర్ సంతోష్ కుమార్ గాంగ్వార్‌.. హేమంత్‌తో ప్రమాణం చేయించారు. హేమంత్ ఒక్కరే ప్రమాణస్వీకారం చేశారు. హేమంత్ ప్రమాణస్వీకారానికి ఇండియా కూటమి నేతలంతా హాజరయ్యారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, సతీమణి సునీతా కేజ్రీవాల్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్, తదితర నేతలంతా హాజరయ్యారు.

 

Show comments