Tamil Nadu: తమిళనాడులోని కాంచీపురం జిల్లాలోని హిందూ పండగ కోసం ఏర్పాటు చేసిన హోర్డింగ్‌పై మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా ఫోటో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ఈ హోర్డింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తమళనాడు అంతటా ఆలయాల్లో అమ్మన్(పార్వతి)ని పూజించే ‘ఆడి’ పండగ కోసం ఈ హోర్డింగ్ ఏర్పాటు చేశారు.
Read Also: Waqf Bill: ‘‘రాజ్యాంగంపై దాడి’’.. వక్ఫ్ బిల్లుపై కాంగ్రెస్ సహా విపక్షాల ఆందోళన..
ఈ పండగ కోసం కురువిమలైలోని నాగతమ్మన్ మరియు సెల్లియమ్మన్ ఆలయాల వద్ద పండుగ దీపాలతో పాటు హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. ఇందులో మియా ఖలీఫా దేవతల చిత్రాలతో కనిపించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె పండగ సంప్రదాయ నైవేధ్యమైన ‘పాల్ కుడం’(పాల పాత్ర)ని మోసుకెళ్తున్నట్లు చూపించారు. ఇదే కాకుండా ఈ హోర్డింగ్ ఎవరు ఏర్పాటు చేసిన వారి ఫోటోలను కూడా హోర్డింగ్‌పై ముద్రించుకున్నారు. సంబంధిత హోర్డింగ్ ఫోటోలు వైరల్ కావడంతో పోలీసులు వెంటనే దానిని తొలగించారు.