Site icon NTV Telugu

కరోనా అంతం కాలేదు కేంద్రమంత్రి హెచ్చరిక

కరోనా అంతం కాలేదని ఈ మహమ్మారి పోరాటంలో అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిసి మెలిసి పని చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ పిలుపునిచ్చారు. దేశంలోని చివ రి పౌరుడి వరకు టీకా అందేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఇంటింటింకి కరోనా వ్యాక్సిన్‌ అందజేసేందుకు చేపడుతున్న హర్‌ ఘర్‌ దస్తక్‌ కార్యక్రమం పై కేంద్ర మంత్రి అన్ని రాష్ర్టాలు, కేంద్ర పా లిత మంత్రులతో గురువారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనమంతా కరోనా అంత మైపో యిందని భావించకూడదన్నారు. ప్రతి ఒక్కరూ అప్రమ త్తతతో వ్యవ హరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కేసులు విజృంభి స్తున్నాయన్నారు. సింగపూర్‌, బ్రిట న్‌, చైనా తదితర దేశాలలో 80శాతానికిపైగా టీకాలు వేసినా వైరస్‌ వేగంగా విస్తరిస్తుందని గుర్తు చేశారు.

16 కోట్లకుపైగా డోసుల నిల్వలు ఉన్నాయి..
ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 79శాతం మంది అర్హులకు మొదటి డోసు టీకా వేసినట్లు మంత్రి తెలిపారు. హర్‌ ఘర్‌ దస్తక్‌లో భాగంగా అర్హులం దరికీ మొదటి డోస్‌, 12 కోట్లకుపైగా జనాభాకు రెండో డోస్‌ పూర్తి చేయ డమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన చెప్పారు. ఈ నెల30 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. మరో వైపు దేశవ్యాప్తంగా వ్యాక్సి నేషన్‌ డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 110.23 కోట్ల డోసులు వేసి నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతా లకు 120.08 కోట్ల డోసులను ఉచితంగా సరఫరా చేశామని తెలిపారు. ఇంకా 16.74 కోట్ల డోసులు ఉన్నాయని దేశంలో చివరి వ్యక్తి వరకు వ్యాక్సినేషన్‌ అందేలా డ్రైవ్‌ను వేగవంతం చేయాలని మాండవీయ సూచించారు.

Exit mobile version