India: భారతదేశం నుంచి పారిపోయిన ప్రతీ మూడో వ్యక్తి అమెరికాలో ఆశ్రయం పొందుతున్నాడని, ఇది నేరస్థులకు, ఉగ్రవాదులకు ‘‘సురక్షిత స్వర్గధామం’’గా మారిందని హోం మంత్రిత్వ శాక మంగళవారం పార్లమెంట్‌కి తెలిపింది. నేరస్తులు, ఉగ్రవాదుల కోసం దర్యాప్తు సంస్థల ద్వారా 178 అప్పగింత అభ్యర్థనలలో యూఎస్ గవర్నమెంట్ 65 అభ్యర్థనలను పరిశీలనలో ఉన్నట్లు వెల్లడించింది. 1997లో అమెరికాతో నేరస్తుల అప్పగింత ఒప్పందం కుదుర్చుకున్నామని, 2002-2018 వరకు కేవలం 11 అభ్యర్థనలను మాత్రమే ఆ దేశం గౌరవించిందని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు.
Read Also: Neelam Bhardwaj: చరిత్ర సృష్టించిన నీలం.. డబుల్ సెంచరీ చేసిన పిన్న వయస్కురాలిగా రికార్డ్
26/11 ముంబై ఉగ్రదాడి కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరిగా అభియోగాలు ఎదుర్కొంటున్న లష్కరే తోయిబా ఉగ్రవాది డేవిడ్ కోల్‌మన్ హెడ్లీని అప్పగించలేదు. అయితే, మరో నిందితుడు తహవ్వూర్ రాణాను భారత్‌కి అప్పగించేందుకు అమెరికా సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి ప్రక్రియలు చివరి దశకు వచ్చాయి. నేర లేదా ఉగ్రవాద కార్యక్రమాలకు పాల్పడినవారిని ఇండియాకు తీసుకువచ్చేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు జరుగుతున్నాయని రాయ్ వెల్లడించారు. ఇప్పటివరకు భారత్ 48 దేశాలతో నేరస్తుల అప్పగింత ఒప్పందంపై సంతకాలు చేసిందని, మరో 12 దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుందని చెప్పారు.
అమెరికాలో ఆశ్రయం పొందతున్న వారు హత్యలు, దోపిడీలు, పిల్లలపై అత్యాచారం, ఆర్థిక మోసం వంటి కేసుల్లో ఉన్నారు. సతీందర్‌జిత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్స్ ఉన్నారు. వీరిద్దరు 2022లో పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యలో కీలకమైన నిందితులు. లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ ఇటీవల అమెరికాలో అరెస్టయ్యారు.