NTV Telugu Site icon

Rahul Gandhi: నా ప్రత్యర్థులు కూడా నాకు గురువులే.. రాహుల్ గాంధీ టీచర్స్ డే సందేశం..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: తన ప్రత్యర్థులు కూడా తనకు గురువులే అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం అన్నారు. టీచర్స్ డేని పురస్కరించుకుని ఆయన అన సందేశాన్ని వినిపించారు. తన ప్రత్యర్థులు ప్రవర్తన, అబద్ధాలు, మాటలు తనను సరైన మార్గంలో ఉంచుతాయని ఆయన అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువులకు నివాళులర్పించారు.

Read Also: Hyderabad: నాన్‌వెజ్ ప్రియులకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వ మటన్ క్యాంటీన్

ఒక ఉపాధ్యాయుడు జీవితంలో చాలా ఉన్నతమైన స్థానంలో ఉంటాడని.. గురువులే మీ జీవిత మార్గాన్ని ప్రకాశించేలా చేస్తారని, సరైన దిశలో వెళ్లేలా ప్రేరేపిస్తారని రాహుల్ గాంధీ చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వానికి ఉదాహరణగా నిలుస్తారని, ప్రతీ సమస్యపై ధైర్యంగా పోరాడేందుకు మనల్ని ప్రేరేపిస్తారని, వినయానికి మార్గదర్శకులుగా ఉంటారని ఆయన అన్నారు. భారతదేశ ప్రజలు కూడా ఉపాధ్యాయులలాంటి వారే అని ఆయన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

మహాత్మా గాంధీ, గౌతమ బుద్ధుడు, శ్రీ నారాయణ గురు వంటి గొప్ప వ్యక్తుల్ని తన గురువులుగా భావిస్తానని రాహుల్ గాంధీ చెప్పారు. వీరంతా సమాజంలోని ప్రజలకు సమానత్వం, ప్రతీ ఒక్కరి పట్ల కరుణ, ప్రేమను చూపించే జ్ఞానాన్ని మనకు అందించారని ఆయన అన్నారు. భారతదేశానికి రెండో రాష్ట్రపతిగా పనిచేసిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కి నివాళిగా ప్రతీ ఏడాది సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటాము. 1962 నుంచి 1967 వరకు ఆయన దేశానికి రాష్ట్రపతిగా సేవలు చేశారు.

Show comments