బెంగళూరు ట్రాఫిక్‌పై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు ట్రాఫిక్‌ను దేవుడు కూడా రాత్రికి రాత్రే మార్చలేడు అని వ్యాఖ్యానించారు. గురువారం ఓ ప్రారంభోత్సవంలో శివకుమార్ మాట్లాడుతూ.. దేవుడు కూడా బెంగళూరును వెంటనే మార్చలేడని పేర్కొన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తాజాగా సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు తప్పుపడుతున్నారు.
‘‘బెంగళూరును రాత్రికి రాత్రే మార్చడం అసాధ్యం. దేవుడే దిగి వచ్చినా అది సాధ్యం కాదు. అయితే సరైన ప్రణాళికలు రూపొందించి వాటిని సమర్థవంతంగా అమలు చేస్తే.. నెమ్మదిగా సాధించవచ్చు” అని శివకుమార్ అన్నారు.
ప్రస్తుతం బెంగళూరు నగర జనాభా 1.4 కోట్ల మంది ఉన్నారు. వాహనాల సంఖ్య 1.1 కోట్లకు చేరింది. అయితే తాను మొదటి నుంచి సొరంగం రోడ్ల గురించి మాట్లాడుతున్నానని.. కానీ ఇప్పటి వరకు టెండర్లు పిలువలేదన్నారు. సాంకేతిక సమస్యలు, భూసేకరణ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇతర విషయాలతో పాటు చాలా సమస్యలు ఉన్నాయని డీకే.శివకుమార్ తెలిపారు. పరిస్థితులను మెరుగుపరచడానికి కృషి చేస్తున్నామన్నారు. సొరంగ రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్లు వంటి ప్రధాన ప్రాజెక్టులు పూర్తైతే ఉపశమనం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు.
ఇది కూడా చదవండి: Bird Flu: 95 గ్రామాలలో నాటుకోళ్లకు బర్డ్ ఫ్లూ.. లబోదిబోమంటున్న పెంపకం దారులు!
బెంగళూరులో నిత్యం భారీ ట్రాఫిక్ ఉంటుంది. ఈ రద్దీ కారణంగా బెంగళూరు ప్రజలు సంవత్సరానికి 117 గంటల విలువైన సమయాన్ని కోల్పోతున్నారు. ప్రపంచంలోనే అత్యంత ట్రాఫిక్ రద్దీగా ఉండే నగరాల్లో బెంగళూరు ఒకటిగా నిలిచింది. టామ్ టామ్ విడుదల చేసిన 2024 ప్రపంచ ట్రాఫిక్ సూచిక ప్రకారం.. బెంగళూరులో రద్దీ సమయంలో 10 కి.మీ ప్రయాణించడానికి సగటు సమయం 34 నిమిషాల 10 సెకన్లు పడుతుందని తెలిపింది.
ఇది కూడా చదవండి: Gold Rates: ఆకాశమే హద్దుగా పెరుగుతున్న పసిడి ధరలు.. 89 వేలకు చేరువలో