Site icon NTV Telugu

పునీత్‌ కళ్లతో నలుగురికి వెలుగు


కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణాన్ని ఇంకా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. హిరోగానే కాకుండా పునీత్‌ ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టాడు. పునీత్ తండ్రి కంఠీరవ రాజ్ కుమార్ చనిపోయినప్పుడు కూడా తన కళ్లను దానం చేశాడు. తండ్రి బాటలోనే పునీత్‌ రాజ్‌కుమార్‌ నడిచి ఆయన కళ్లను దానం చేశారు. పునీత్ చివరకు చనిపోతూ కూడా నలుగురికి కంటిచూపును ప్రసాదించి వారి జీవితాల్లో వెలుగులు నింపాడు ఈ స్టార్‌ హీరో.

ఆయన దానం చేసిన కళ్లతో ఒకే రోజు నలుగురికి చూపును ప్రసాదించారు డాక్టర్లు. మాములుగా అయితే ఇలా దానం చేసిన కళ్లను ఇతరులకు ట్రాన్స్‌ప్లాంట్‌ చేస్తారు. ఒక వ్యక్తి దానం చేసిన కళ్లతో ఇద్దరికి మాత్రమే చూపు దక్కుతుంది. అయితే డాక్టర్లు మాత్రం పునీత్‌ కళ్లలోని కార్నియాలను వేరు చేసి నలుగురికి శస్ర్త చికిత్స చేశారు దీంతో ఒకే రోజు నలుగురికి చూపు దక్కింది. పునీత్‌ కళ్లను ఎవ్వరికి అమర్చారనేది డాక్టర్లు చెప్పలేదు. అవసరమున్న వారికే అమర్చామని డాక్టర్లు చెప్పారు.

Exit mobile version