NTV Telugu Site icon

Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

Pabhojan Gold Tea

Pabhojan Gold Tea

న భారతీయులు ‘టీ’కి ఎంత ప్రాధాన్యం ఇస్తారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. కొందరైతే భోజనం లేకపోయినా ఉండగలరేమో గానీ, టీ లేకుండా ఉండలేరు. అందుకే, దేశంలో గల్లీకో టీ స్టాల్ ఉంటుంది. ఇంత డిమాండ్ ఉన్నప్పుడు, ఇందులోనూ ప్రత్యేకతలు కావాలని కోరుకుంటారు కదా! ఈ నేపథ్యంలోనే అసోంలో పభోజన్ గోల్డ్ టీని సిద్ధం చేశారు. ఇదొక ఆర్గానిన్ తేయాకు. అత్యంత అరుదైన రకం. అసోంలోని గోలాఘాట్ జిల్లాలో దీన్ని మొదటిసారి ఒక కిలో మాత్రమే పండించారు. ఆ కిలో తేయాకు అక్షరాల రూ. 1 లక్షకు అమ్ముడుపోవడం హాట్ టాపిక్‌గా మారింది.

జోర్హాట్‌లోని వేలం కేంద్రంలో సోమవారం ఈ తేయాకు విక్రయం జరిగింది. అసోంకు చెందిన ‘ఎసాహ్ టీ’ బ్రాండ్ దీనిని రూ. 1 లక్షకు కొనుగోలు చేసినట్టు వేలం కేంద్రం అధికారి స్పష్టం చేశారు. ఈ టీ పొడితో తయారయ్యే టీ.. పసుపు రంగులో ప్రశాశవంతంగా ఉంటుంది. ఈ తేయాకుని కోసిన తర్వాత సహజసిద్ధంగానే బంగారు వర్ణంలోకి మారిపోతుంది. ఇది టీకి మంచి రుచిని కూడా అందిస్తుంది. ఈ తేయాకు కొనుగోలు చేసిన ఎసాహ్ టీ సీఈవో బిజిత్ శర్మ మాట్లాడుతూ.. అత్యంత నాణ్యమైన టీని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కస్టమర్లకు అందించడానికి వీలుంటుందని తెలిపారు. అటు.. తాము కేవలం ఒక కిలో మాత్రమే ఈ తేయాకుని పండించామని పభోజన్ ఆర్గానిక్ టీ ఎస్టేట్ యజమాని రాఖీదత్తా చెప్పారు. ఇది రికార్డ్ స్థాయిలో అత్యధిక ధర పలకడం సంతోషంగా ఉందన్నారు.