Site icon NTV Telugu

EPFO 3.O: ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త ఏడాది నుంచి ఏటీఎమ్ నుంచి ఫీఎఫ్..

Untitled Design (1)

Untitled Design (1)

ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. వచ్చే ఏడాది నుంచి EPFO కొత్తగా ప్రారంభించనున్న EPFO 3.0 ప్లాట్‌ఫామ్ ద్వారా ATM/UPI సాయంతో పీఎఫ్ డబ్బులను నేరుగా విత్‌డ్రా చేసుకునే సౌకర్యం కల్పించనున్నట్టు తెలుస్తోంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ముఖ్యంగా ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఉపయోగం కలగనున్నదని ఈపీఎఫ్ అధికారులు తెలిపారు.

ఎన్నో నెలలుగా ఉద్యోగులు ఆశించినట్లుగా, ATM ద్వారా EPF ఉపసంహరణ సేవ కొత్త సంవత్సరం నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వినియోగదారులకు మరింత సులభమైన, వేగవంతమైన సేవలను అందించేందుకు EPFO 3.0 అనేక కొత్త ఫీచర్లతో రానున్నట్లు సమాచారం.

అయితే, ATM ద్వారా పీఎఫ్ విత్‌డ్రా సౌకర్యంపై EPFO ఇప్పటికీ అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ, వచ్చే సంవత్సరం తొలి త్రైమాసికంలోనే ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఉద్యోగ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.ఈ నూతన స్సంస్కరణలు అమల్లోకి వస్తే, పీఎఫ్ డబ్బు పొందే ప్రక్రియ మరింత సులభం అవుతుందని ఖాతాదారులు విశ్వసిస్తున్నారు.

Exit mobile version