జమ్ము కాశ్మీర్ పుల్వామాలో అలజడి రేగింది. భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో జైషే మహ్మద్ ఉగ్రవాది హతం అయ్యాడు. మరో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేశాయి భద్రతా బలగాలు. మరికొందరి కోసం గాలింపు ముమ్మరం సాగుతోంది. ఇంకా ఉగ్రవాదులు వున్నారని భద్రతా బలగాలు చెబుతున్నాయి. కాల్పులు ఇంకా కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది.
పుల్వామాలోని నైనా బట్‌పోరాలో భద్రతా బలగాలు భారీ ఆపరేషన్‌ను నిర్వహించాయి. రెండురోజుల క్రితం ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ప్రస్తుతం ఇంకా ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. ఉగ్రవాదులు ఇంకా ఘటనా స్థలంలో దాక్కోగా.. బలగాలు వారిని లొంగిపోవాలని సూచించాయి. సెర్చ్ ఆపరేషన్ నేపథ్యంలో ఆ ప్రాంతంలో కదలికలు నిలిచిపోయాయి.
సామాన్య పౌరులకు ఇబ్బంది కలగకుండా బలగాలు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. గత కొద్దికాలంగా భారత్ భూభాగంలోకి రావాలని పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు ప్రయత్నాలు చేస్తున్నారు. వారిని భద్రతా బలగాలు తిప్పికొడుతున్నాయి. ఎన్ కౌంటర్లలో ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోతున్నా కవ్వింపు చర్యలు మాత్రం కొనసాగిస్తూనే వున్నారు ముష్కరమూకలు.
