NTV Telugu Site icon

Ukraine War: ‘‘మాకు సాయం చేయండి’’.. ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్న కేరళ వాసి..

Ukraine War

Ukraine War

Ukraine War: ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరుపున పలువురు భారతీయులు బలవంతంగా పనిచేయాల్సి వస్తోంది. యుద్ధంలో రష్యా తరుపున పోరాడుతూ ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయంపై భారత్ తన అభ్యంతరాన్ని ఇప్పటికే రష్యాకు చెప్పింది. భారతీయుల్ని యుద్ధ క్షేత్రం నుంచి పంపించాలని సూచించింది. ఇదిలా ఉంటే, తాజాగా కేరళ త్రిస్సూర్‌ లోని కురంచేరికి చెందిన 32 ఏళ్ల జైన్ కురియన్ వీడియో వెలుగులోకి వచ్చింది.

తాను రష్యాలో ఎదుర్కొంటున్న బాధల్ని వీడియోలో వెల్లడించారు. కురియన్ మొదట్లో రష్యాకు క్యాంటీన్‌లో పనిచేయడానికి వెళ్లారు. ఆ తర్వాత రష్యన్ కిరాయి సైనిక బృందంలో చేర్చుకున్నట్లు వీడియోలో ఆయన పేర్కొన్నారు. కట్టనెల్లూర్ ప్రాంతానికి చెందిన బినిల్ బాబుతో కలిసి జైన్ కురియన్ ఒక ఏజెంట్ సాయంతో రష్యాకు వెళ్లాడు. వారు క్యాంటీన్‌లో పనిచేయడానికి వెళ్లారు. యుద్ధ ప్రాంతంలో పట్టుబడి, రష్యా తరుపున పోరాటం చేస్తు్న్నారు. వీరిద్దరు ఫ్రంట్ లైన్ దళాలకు నీరు, ఆహారం తీసుకువెళ్తున్న సమయంలో బలవంతంగా రష్యన్ బలగాల్లో చేరాల్సి వచ్చింది. జైన్ భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాడు, కానీ నెలల క్రితమే అతడి ఒప్పందం రద్దు చేయబడిందని చెప్పారు.

Read Also: Manchu Manoj: మొన్న పంది పి**డా.. ఇప్పుడు ఎలుగు బంటి.. ఏందయ్యా మనోజ్?

‘‘ మేము రాయబార కార్యాలయంలో రామ్ కుమార్ సర్‌ని సంప్రదించాం. మూడు నెలల క్రితమే మా ఒప్పందం రద్దు చేయబడిందని సార్ మాకు చెప్పారు. కానీ మేము ఇక్కడ ఉన్న మా కమాండర్‌కి దాని గురించి తెలియజేసినప్పటికీ, మా ఒప్పందం ఇంకా రద్దు కాలేదని చెప్పారు. మా తొలగింపు గురించి రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి ఆర్డర్ రావాలని ఆయన అన్నారు. మాకు ఏం చేయాలో తెలియడం లేదు. దయచేసి ఏదో విధంగా మాకు సాయం చేయండి’’ అంటూ జైన్ భావోద్వేగంతో వీడియోలో చెప్పారు.

జైన్ మాస్కోలని ఒక ఆస్పత్రికి తరలించబడ్డాడు. ఆ సమయంలో అతను మూడు రోజుల క్రితం తన కుటుంబ సభ్యులకు వాట్సాప్ కాల్ చేసి, దాడిలో తాను గాయపడినట్లు చెప్పారు. బినల్ బాబు కాల్పులకు గురైన తర్వాత యుద్ధ భూమిలోనే మరణించాడు. అతడి మరణ వార్తను భారత రాయబార కార్యాలయం కుటుంబానికి తెలియజేసింది.

Show comments