Site icon NTV Telugu

Amit Shah: కాసేపట్లో అమిత్ షా అధ్యక్షతన కీలక సమావేశం

Amit Shah

Amit Shah

దేశ రాజధాని ఢిల్లీలో బాంబ్ పేలుడు నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అత్యవసర సమావేశం నిర్వహిస్తోంది. ఉదయం 11 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. హోం కార్యదర్శి గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, జాతీయ దర్యాప్తు సంస్థ డైరెక్టర్ జనరల్, ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఇతర సీనియర్ అధికారులు హాజరుకానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జమ్మూ కాశ్మీర్ డీజీపీ, కేంద్ర పాలిత ప్రాంతం ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఢిల్లీ పేలుడిపై ప్రాథమికంగా అందిన సమాచారం, ఉగ్ర సంస్థల ప్రమేయం, భారీ కుట్రపై సమీక్షించనున్నారు.

ఇది కూడా చదవండి: Delhi Car Blast: ఢిల్లీ పేలుడు ఘటన.. దర్యాప్తులో కీలక విషయాలు ఇవే!

సోమవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ పార్కింగ్ స్థలం దగ్గర పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 9 మంది చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం దర్యాప్తు సంస్థలు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇక నిందితుడికి సంబంధించిన వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి.

ఇది కూడా చదవండి: Bihar Elections Live Updates: బీహార్‌ రెండో విడత పోలింగ్‌ లైవ్‌ అప్‌డేట్స్..

Exit mobile version