Site icon NTV Telugu

Elgar Parishad Case: హక్కుల కార్యకర్త గౌతమ్ నవ్లాఖాకు పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలు..

Elgar Parishat Case

Elgar Parishat Case

Elgar Parishad Case: ఎల్గార్ పరిషత్, మావోయిస్టు సంబంధాల కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. హక్కుల కార్యకర్త గౌతమ్ నవ్లాఖాకు పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) తెలిపింది. అతని బెయిల్ దరఖాస్తును వ్యతిరేకిస్తూ బాంబే హైకోర్టుకు తెలిపింది. నవ్లాఖా జాతీయ భద్రత, ఐక్యత, సార్వభౌమాధికారంపై ప్రభావం చూపేలా పలు చర్యలకు పాల్పడ్డారని ఎన్ఐఏ కోర్టుకు తెలిపింది. నవ్‌లాఖా బెయిల్‌ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్ ను ఎన్ఐఏ న్యాయవాది సందేశ్ పాటిల్ సోమవారం జస్టిస్ ఎఎస్ గడ్కరీ, పిడి నాయక్‌లతో కూడిన బెంచ్ ముందుంచారు. దీనిపై ఫిబ్రవరి 27న వాదనలు జరగనున్నాయి.

Read Also: Revanth Reddy: కొనసాగుతున్న రేవంత్ రెడ్డి హాథ్ సే హాథ్ జోడో యాత్ర.. నేడు భూపాలపల్లి నియోజకవర్గంలో..

పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధం ఉన్న గులాం నబీఫై, గౌతమ్ నవ్లాఖాకు సంబంధాలు ఉన్నాయి. గతంలో గులాం నబీ ఫై నిర్వహించిన కాశ్మీరీ అమెరికన్ కౌన్సిల్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడేందుకు నవ్‌లాఖా మూడుసార్లు యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లారని, అప్పటి నుంచి అతడితో నవ్లాఖా టచ్ లో ఉన్నాడని ఎన్ఐఏ అఫిడవిట్ లో పేర్కొంది. ఐఎస్ఐ, పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి నిధులు అందుకుంటున్నాడనే అభియోగాలతో 2011 జూలైలో ఎఫ్బీఐ అధికారులు గులాం నబీని అరెస్ట్ చేశారు. రిక్రూట్మెంట్ కోసం పాకిస్తాన్ ఐఎస్ఐ జనరల్ కి గులాం నబీ ఫై ద్వారా గౌతమ్ నవ్లాఖా పరిచయం చేయబడ్డాడు.

ఆరోగ్య కారణాల రీత్యా సుప్రీంకోర్టు ప్రస్తుతం నవ్లాఖాను గృహనిర్భందంలో ఉంచింది. ఇతడికి సీపీఐ(మావోయిస్ట్) పార్టీతో సంబంధాలు ఉన్నాయి. మావోయిస్టు భావజాలాన్ని, ప్రభుత్వ వ్యతిరేకతను వ్యాపించేలా వీడియోలు, ఉపన్యాసాలు ఇచ్చాడని ఎన్ఐఏ తెలిపింది. ప్రభుత్వ బలగాలకు వ్యతిరేకంగా, మావోయిస్టు గెరిల్లా కార్యకలాపాల కోసం కార్యకర్తలను నియమించే బాధ్యతలను గౌతమ్ నవ్లాఖా చూస్తుండే వాడు. డిసెంబరు 31, 2017న పూణేలో జరిగిన ఎల్గర్ పరిషత్ సమ్మేళనంలో ఉద్రేకపూరిత ప్రసంగాలు చేసి, తర్వాతి రోజు పూణే జిల్లాలోని కోరేగావ్-భీమా యుద్ధ స్మారక చిహ్నం సమీపంలో హింసను ప్రేరేపించినట్లు చేశారు. ఇది ఎల్గార్ పరిషత్ కేసులో ప్రసిద్ది చెందింది. ఈ కార్యక్రమంలో మావోయిస్టుల పాత్ర ఉందని పోలీసులు ప్రకటించారు.

Exit mobile version