Site icon NTV Telugu

Rajya Sabha Elections: 57 రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్‌ విడుదల

Rajya Sabha

Rajya Sabha

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా 15 రాష్ట్రాల్లోని 57 రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్‌ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.. జూన్ 10వ తేదీన పోలింగ్‌ జరగనుండగా.. అదే రోజు ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.. ఈనెల 24వ తేదీన రాజ్యస‌భ ఎన్నిక‌ల కోసం నోటిఫికేష‌న్ విడుదల కానుండగా.. 24వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.. ఇక, జూన్ 1న నామినేషన్లు పరిశీలన, జూన్ 3న నామినేషన్ల విత్ డ్రాకు చివరి తేదీ కాగా.. జూన్ 10న పోలింగ్‌ నిర్వహించనున్నారు.. జూన్ 10వ తేదీన ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుండగా… అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడిస్తారు..

Read Also: Cyclone Asani: బలహీన పడిన ‘అసని’.. కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు

మొత్తం 15 రాష్ట్రాల్లో ఉన్న 57 ఖాళీల‌కు ఈ ఎన్నిక‌లు జరగబోతున్నాయి.. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 11 స్థానాలకు, ఆంధ్రప్రదేశ్లో 4, రాజ‌స్థాన్‌లో 4, చ‌త్తీస్‌గఢ్‌లో 4, జార్ఖండ్‌లో 2, మ‌హారాష్ట్రలో 6, త‌మిళనాడులో 6, పంజాబ్‌లో 2, ఉత్తరాఖండ్‌లో 2, బీహార్‌లో 5, తెలంగాణలో 2, హ‌ర్యానాలో 2, మ‌ధ్యప్రదేశ్‌లో 3, ఒడిశాలో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్‌-ఆగస్టులో రిటైర్ కానున్న రాజ్యసభ సభ్యుల స్థానాలకు ఈ ఎన్నికలు నిర్వహిస్తోంది కేంద్ర ఎన్నికల కమిషన్‌.

Exit mobile version