NTV Telugu Site icon

Bengal Governor: ఎన్నికలు బ్యాలెట్లతో జరగాలి..బుల్లెట్లతో కాదు: బెంగాల్ గవర్నర్

Bengal Governor

Bengal Governor

Bengal Governor: శనివారం బెంగాల్లో జరుగుతున్న పంచాయత్ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు బ్యాలెట్లతో జరగాలని.. ..బుల్లెట్లతో కాదని అన్నారు.
పంచాయత్‌ ఎన్నికల సందర్భంగా బెంగాల్‌లో ఎక్కువగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ప్రజలు, రాజకీయ పార్టీలు రక్తపాతాన్ని ఆపాలని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద బోస్ కోరారు. బుల్లెట్లతో కాకుండా బ్యాలెట్లతో ఎన్నికలు జరగాలని గవర్నర్ అన్నారు. బయటకు వెళ్లి ఓటు వేయడానికి గుండాలు అనుమతించడం లేదని ప్రజలు తనోతో అన్నారని.. హత్యలు జరుగుతున్నాయని ప్రజలు తనతో చెప్పారని.. తుపాకీ కాల్పులు వినిపించాయని ప్రజలు నాతో అన్నారు.. ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత పవిత్రమైన రోజు, రక్తపాతం ఆగాలి అని గవర్నర్‌ అన్నారు.

Read also: Salaar: ఇది శాంపిల్ మాత్రమే… ఆగస్టులో వచ్చే ట్రైలర్ మీ ఊహకే వదిలేస్తున్నాం

పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలకు ముందు, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హింస చెలరేగింది. వేర్వేరు హింసాత్మక ఘటనల్లో ఆరుగురు మరణించారు. వారిలో నలుగురు టిఎంసి కార్యకర్తలు ఉండగా..బిజెపి మరియు కాంగ్రెస్ నుండి ఒక్కొక్కరు చొప్పున మరణించారు. ప్రత్యర్థి పార్టీలకు చెందిన ఇతర కార్యకర్తలు తమపై దాడి చేశారని ఇరు పార్టీల నాయకులుఆరోపించారు. పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ కట్టుదిట్టమైన భద్రత మధ్య శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఇందులో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న 5 కోట్ల మందికి పైగా ప్రజలు ఓటు వేయడానికి అర్హులని అధికారులు తెలిపారు. కూచ్‌బెహార్ జిల్లాలోని ఫలిమరి గ్రామ పంచాయతీలో బీజేపీ పోలింగ్ ఏజెంట్ హత్యకు గురైనట్లు అధికారులు తెలిపారు. బిశ్వాస్‌ పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, టీఎంసీ మద్దతుదారులు ఆయనను అడ్డుకున్నారని, పరిస్థితి చేయిదాటిపోవడంతో హత్య చేశారని బీజేపీ ఆరోపించింది. ఈ ఆరోపణలను టీఎంసీ ఖండించింది.

Read also: Traffic Alert: ట్రాఫిక్ అలర్ట్.. నేటి నుంచి ఈ నెల 10 వరకు ఆంక్షలు

ఉత్తర 24 పరగణాస్‌ జిల్లాలోని కదంబగచి ప్రాంతంలో స్వతంత్ర అభ్యర్థి మద్దతుదారుడు రాత్రిపూట కొట్టడంతో మరణించాడని పోలీసులు తెలిపారు. మరణించిన వ్యక్తి 41 ఏళ్ల అబ్దుల్లాగా గుర్తించారు. స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం మృతి చెందినట్లు పోలీసు సూపరింటెండెంట్ భాస్కర్ ముఖర్జీ తెలిపారు. హత్యను నిరసిస్తూ, స్థానికులు తెల్లవారుజామున టాకీ రహదారిని దిగ్బంధించారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. ముర్షిదాబాద్ జిల్లా కపస్‌దంగా ప్రాంతంలో రాత్రి జరిగిన ఎన్నికల హింసాకాండలో ఒక TMC కార్యకర్త మరణించాడు. మృతుడు బాబర్ అలీగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ముర్షిదాబాద్ జిల్లాలోని రెజీనగర్ మరియు ఖర్‌గ్రామ్‌లో ఇద్దరు కార్మికులు, కూచ్‌బెహార్ జిల్లాలోని తుఫాన్‌గంజ్‌లో మరొకరు మరణించారని అధికార TMC తెలిపింది. పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. కానీ నిన్న రాత్రి నుండి కాంగ్రెస్, బిజెపి మరియు సిపిఎంలు టిఎంసి కార్యకర్తలపై దాడుల చేస్తున్నాయని.. రెజినగర్, తుఫాన్‌గంజ్ మరియు ఖర్‌గ్రామ్‌లలో తమ కార్యకర్తలు ముగ్గురు మరణించారని టీఎంసీ నేతలు తెలిపారు. డోమ్‌కల్‌లో తమ ఇద్దరు కార్యకర్తలు గాయపడ్డారని.. కేంద్ర బలకకాలు ఎక్కడ ఉన్నారని టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ ప్రశ్నించారు.