బీజేపీ జాతీయ నూతన అధ్యక్షుడి ఎంపిక మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలని ఎప్పటినుంచో పార్టీ ఆలోచన చేస్తోంది. కానీ ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ఇక ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా రెండు పర్యాయాల పదవీ కాలం ఇప్పటికే ముగిసింది. ప్రతీ మూడేళ్లకోసారి ఎన్నిక జరుగుతుంటుంది. 2019 నుంచి 2024 వరకు రెండు సార్ల పదవీ కాలం ముగిసింది. ప్రస్తుతం నడ్డానే అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందే కొత్త అధ్యక్షుడ్ని ఎంపిక చేయాలని భావించారు. కానీ ఇప్పట్లో అది కుదిరే పనిలా కనిపించడం లేదు.
ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర
ఇక జగదీప్ ధన్‌ఖర్ అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. సెప్టెంబర్ 9నే ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఇందుకోసం పార్టీ విధేయుల్ని అధిష్టానం జల్లెడ పడుతుంది. సీనియర్లలో ఎవరు నమ్మకస్థులుగా ఉన్నారో వారిని ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేయాలని హైకమాండ్ భావిస్తోంది. ప్రస్తుతం ఈ పనిలో బిజీగా ఉండడంతో బీజేపీ నూతన అధ్యక్ష ఎన్నిక ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ తర్వాతే ఎన్నిక ఉండొచ్చని వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంతలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేయనుంది. ఒకవేళ అదే జరిగితే నూతన అధ్యక్షుడి ఎంపిక మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Boda Kakarakaya: బోడకాకరకాయతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..!
ఇక ఈసారి అధ్యక్ష పదవి మహిళలకు ఇవ్వాలని అదిష్టానం భావిస్తోంది. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు గానీ.. రాజమండ్రి ఎంపీ పురందేశ్వరికి గానీ ఆ పదవిని కట్టబెట్టొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో దక్షిణ భారత్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో సౌతిండియా మహిళకే ఆ అవకాశం రావొచ్చని వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇది కూడా చదవండి: Trump: భారత్ గురించి ఆ మాట విన్నాను.. అలా చేస్తే మంచిదే
