NTV Telugu Site icon

Election Results: మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్ దాటిన బీజేపీ..

Bjp

Bjp

Election Results: ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగా మధ్యప్రదేశ్ , రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు దిశగా పయణిస్తోంది. ఇప్పటికే ఆ రాష్ట్రాల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటి ఆధిక్యత సాధించింది. ఈ రెండు రాష్ట్రాలు దాదాపుగా బీజేపీ పార్టీ ఖాతాలో పడే అవకాశం కనిపిస్తోంది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు దశాబ్ధాలుగా బీజేపీ అధికారాన్ని కలిగి ఉంది. తాజాగా మరోసారి కూడా అధికారం దిశగా పయనిస్తోంది. మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు ఉన్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే బీజేపీ దాని మిత్రపక్షాలు 136 స్థానాల్లో ఆధిక్యత ప్రదర్శిస్తోంది. కాంగ్రెస్ కేవలం 90 స్థానాల్లోనే ఆధిక్యంలో ఉంది. బీఎస్పీ, ఇతరులు రెండు చోట్ల లీడింగ్‌లో ఉన్నారు.

Read Also: Honor X7b Launch : హానర్ నుంచి మరో స్మార్ట్ ఫోన్.. సెల్ఫీ ప్రియులకు పండగే పండగ.. ధర ఎంతంటే?

ఇక రాజస్థాన్ రాష్ట్రంలో ఓటర్లు సాంప్రదాయాన్ని కొనసాగించారు. ఈ రాష్ట్రంలో ఇటీవల కాలంలో ఎప్పుడూ కూడా ఒక పార్టీ రెండు సార్లు అధికారంలోకి రాలేదు. ఈ సారి కూడా అదే విధంగా రాజస్థాన్ ఓటర్లు తీర్పు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ రాష్ట్రంలో 199 స్థానాలకు గానూ.. 109 స్థానాల్లో బీజేపీ లీడింగ్ లో ఉంది. ఇక కాంగ్రెస్ 75 స్థానాలకే పరిమితమైంది. బీఎస్పీ ఒక చోట, ఇతరులు 14 చోట్ల లీడింగ్ లో ఉన్నారు. దాదాపుగా ఈ రెండు రాష్ట్రాలు కూడా బీజేపీ ఖాతాలో చేరే అవకాశం ఉంది.

Show comments