NTV Telugu Site icon

Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల లోగో, ట్యాగ్‌లైన్‌ని ఆవిష్కరించిన ఎలక్షన్ కమిషన్

Loksabha Elections

Loksabha Elections

Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు రెండు-మూడు నెలలు మాత్రమే ఉంది. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టింది. ఎన్నికల నిర్వహణ, తేదీలపై కార్యచరణ జరుగుతోంది. ఏప్రిల్ నెలలో సార్వత్రిక ఎన్నికలు జరగవచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి లోగో, ట్యాగ్‌లైన్‌ని గురువారం ఆవిష్కరించింది. ఎన్నికల ట్యాగ్ లైన్ ‘చునావ్ కా పర్వ్, దేశ్ కా గర్వ్’( ఎన్నికల పండగ దేశానికి గర్వకారణం) అని పేర్కొంది. అయితే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తేదీలను ప్రకటించాల్సి ఉంది.

Read Also: Manoj Kumar Sharma: ‘12th ఫెయిల్’ ఐపీఎస్ అధికారికి మెరిటోరియస్ సర్వీస్ మెడల్..

లోక్‌సభ ఎన్నికల కోసం ఇప్పటికే దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సారి 400కు పైగా ఎంపీ స్థానాల్లో గెలవాలని టార్గెట్‌ చేసింది. మరోవైపు ప్రధాని నరేంద్రమోడీని గద్దె దించేందుకు ఇండియా కూటమి పేరుతో ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే ఈ కూటమిలో ప్రస్తుతం ప్రతిపక్షాల మధ్య ఐక్యత కనిపించడం లేదు.