Site icon NTV Telugu

EVM: ‘‘ఈవీఎంలు హ్యాక్ అవుతాయి’’.. తులసీ గబ్బార్డ్ వ్యాఖ్యలపై ఈసీ క్లారిటీ..

Evm

Evm

EVM: భారత ఎన్నికల్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్(ఈవీఎంలు) హ్యాక్ అవుతాయనే ఆరోపణల్ని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం తోసిపుచ్చింది. ఈ యంత్రాలు ఇంటర్నెట్ లేదా ఇన్‌ఫ్రారెడ్‌తో అనుసంధానించడబటం లేదని, సాధారణ కాలిక్యులేటర్ల వలే పనిచేస్తాయని పేర్కొంది. ఓట్లను తారుమారు చేయడానికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ వ్యవస్లను హ్యాకింగ్ చేసే దుర్భలత్వానికి సంబంధించిన ఆధారాలను తమ కార్యాలయం పొందిందని యునైటెడ్ స్టేట్స్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసీ గబ్బార్డ్ చేసిన వ్యాఖ్యలపై ఈసీ స్పందించింది. కొన్ని దేశాలు ఇంటర్నెట్‌తో సహా వివిధ ప్రైవేట్ నెట్వర్క్‌లతో సహా మల్టీ సిస్టమ్స్‌తో అనుసంధానించబడిన ‘‘ఎలక్ట్రానిక్ ఓటింగ్ వ్యవస్థల్ని’’ కలిగి ఉందని ఈసీ ఎత్తిచూపింది.

Read Also: Amit Shah: తమిళానికి స్టాలిన్ ఏం చేశారు.? బీజేపీ తమిళ భాష, సంస్కృతిని గౌరవిస్తుంది

భారతదేశంలో సరళమైన, ఖచ్చితమైన కాలిక్యులేటర్ల వలే పనిచేసే ఈవీఎంలను ఉపయోగిస్తోందని, ఇది హ్యాకింగ్‌కి అవకాశం లేకుండా ఎలాంటి ఇంటర్నెట్, ఇన్‌ఫ్రారెడ్‌లతో అనుసంధానించడం లేదని ఈసీ చెప్పింది. ఈ యంత్రాలు సుప్రీంకోర్టు చట్టపరమైన పరిశీలనకు గురయ్యాయని, వాస్తవ పోలింగ్‌కి ముందు మాక్ పోలింగ్ నిర్వహించడంతో సహా వివిధ దశల్లో రాజకీయ పార్టీలతో నిరంతరం తనిఖీ చేయబడుతున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. రాజకీయ పార్టీలు లెక్కింపు ముందు ఐదు కోట్లకు పైగా పేపర్ ట్రైల్ మెషిన్ స్లిప్‌లను ధ్రువీకరించి, సరిపోల్చుతాయని చెప్పింది.

టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ గతేడాది ఈవీఎంలను తొలగించాలని పిలుపునిచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా హ్యాక్ చేయవచ్చని హెచ్చరించారు. అప్పటి ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ మస్క్ వాదనలకి స్పందిస్తూ, ‘‘”మన ఎన్నికలు జరుగుతున్నప్పుడు EVMలను హ్యాక్ చేయవచ్చని ఒక ప్రపంచ ఐటీ నిపుణుడు అన్నారు. వారి వద్ద (యుఎస్) EVMలు లేవు, వారి వద్ద ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానాలు ఉన్నాయి. అదే వ్యక్తి తరువాత భారతదేశంలో ఓట్ల లెక్కింపు పూర్తిగా ఒక రోజులో ముగుస్తుందని, యూఎస్‌లో నెల కంటే ఎక్కువ సమయం పడుతుందని చెప్పారు’’ అనే విషయాన్ని గుర్తు చేశారు. .

Exit mobile version