Arun Goel: లోక్‌సభ ఎన్నికలకు కొన్ని వారాల ముందు కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ రాజీనామానాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. దీంతో ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం భారమంతా ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌పై పడింది. లోక్‌సభ ఎన్నికల తేదీలను వచ్చే వారం వస్తుందనే వార్తల నేపథ్యంలో ఆయన రాజీనామా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం అరుణ్ గోయెల్ లోక్‌సభ ఎన్నికల సన్నాహాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. పలు రాష్ట్రాల్లో ఏర్పాట్లను పరిశీలించేందుకు పర్యటిస్తున్నారు. ఈ సమయంలోనే రాజీనామా ఆమోదం పొందడం అందర్ని షాక్‌కి గురిచేస్తోంది.
గోయెల్ 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. గోయెల్ గతంలో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పనిచేశారు. నవంబర్ 18, 2022న స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. ఒక రోజు తర్వాత ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. నిజానికి గోయెల్ పదవీ కాలం 2027 వరకు ఉంది. వచ్చే ఏడాది ప్రధాన ఎన్నికల కమిషన్ రాజీవ్ కుమార్ పదవీ విరమణ తర్వాత ఈ పదవి రేసులో గోయెల్ ఉన్నారు. ఇప్పటికే ఈసీ ప్యానెల్‌లో ఒక ఖాళీ ఉండగా.. గోయెల్ రాజీనామాతో కేవలం ఇప్పుడు సీఈసీ రాజీవ్ కుమార్ మాత్రమే మిగిలారు.