Site icon NTV Telugu

ఎగ్జిట్ పోల్స్‌పై ఈసీ నిషేధం.. ఉల్లంఘిస్తే జైలుకే..!

భార‌త్‌లో జ‌రుగుతోన్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. మినీ స‌మ‌రాన్ని త‌ల‌పిస్తున్నాయి.. జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు విజ‌యం కోసం స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నాయి.. అయితే, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్, పంజాబ్‌ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై ఎటువంటి ఎగ్జిట్ పోల్ సర్వేలు చేప‌ట్ట‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేసింది.. ఫిబ్రవరి 10వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మార్చి 7వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధిస్తూ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్‌.

Read Also: అంత‌ర్జాతీయ క్రికెట్‌కు స్టార్ ప్లేయ‌ర్ గుడ్‌బై.. విధి లేకే ఈ నిర్ణ‌యం

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై ఫిబ్ర‌వ‌రి 10వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వ‌ర‌కు ఎగ్జిట్ పోల్స్ నిర్వ‌హించ‌రాదంటూ.. ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియాల్లో ఎవ్వరూ ఎగ్జిట్‌ పోల్స్ నిర్వ‌హించ‌డం గానీ, ఎగ్జిట్ పోల్ సర్వేల ఫ‌లితాల‌ను ప్రసారం గానీ చేయ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేసింది కేంద్ర ఎన్నిక‌ల సంఘం.. ఒక వేళ.. త‌మ ఆదేశాల‌ను ప‌ట్టించుకోకుండా.. స‌ర్వేలు చేయ‌డం, వాటి ఫ‌లితాల‌ను ప్ర‌సారం చేసే చ‌ర్య‌ల‌కు పూనుకుంటూ మాత్రం.. రెండేళ్ల జైలు శిక్ష లేదా భారీ జరిమానా.. కొన్ని స‌మ‌యాల్లో రెండు కలిపి విధించ‌నున్న‌ట్టు సీఈసీ స్ప‌ష్టం చేసింది.

Exit mobile version