Site icon NTV Telugu

రాజ్యసభ ఉపఎన్నికలకు రంగం సిద్ధం..

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఖాళీ అయిన 6 రాజ్యసభ స్థానాల ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. వీటితో పాటు బీహార్లో ఒక శాసనమండలి స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. మరోవైపు పశ్చిమ బెంగాల్, ఒడిశాలో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేసింది. అసోం, తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 6 రాజ్యసభ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి.
వాయిస్..
ఈ ఎన్నికలకు సంబంధించి సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ కు సెప్టెంబర్ 22 తుది గడువుగా నిర్ణయించారు. విత్ డ్రాయల్ కు సెప్టెంబర్ 27 వరకు గడువు ఇచ్చారు. అక్టోబర్ 4న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహించి.. ఆ వెంటనే ఫలితాలు ప్రకటిస్తామని తెలిపింది ఎన్నికల సంఘం. రాజ్యసభ ఉప ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు కరోనా మార్గదర్శకాల నిర్వహించనున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేయనున్న భవానీపూర్ నియోజకవర్గం ఉపఎన్నిక కూడా ఇందులో భాగంగానే జరగనుంది.

Exit mobile version