NTV Telugu Site icon

జేఈఈ మెయిన్స్‌ షెడ్యూల్‌ విడుదల

Ramesh Pokhriyal

Ramesh Pokhriyal

జేఈఈ మెయిన్స్‌ 3వ, 4వ విడత పరీక్షల షెడ్యూల్ విడుదలైంది.. కోవిడ్ కారణంగా ఏప్రిల్, మేలో జరగాల్సిన మూడు, నాల్గోవ విడత జేఈఈ మెయిన్స్ వాయిదా పడగా.. ఫిబ్రవరి, మార్చిలో మొదటి, రెండో విడత జేఈఈ మెయిన్స్‌ నిర్వహించారు.. ఇవాళ మిగతా సెషన్స్‌ పరీక్షల తేదీలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్‌ పొఖ్రియాల్‌ ప్రకటించారు. ఏప్రిల్‌ నెలలో జరుగాల్సిన సెషన్‌ను ఈనెల 20 నుంచి 25 రెండో సెషన్‌ జసరుగుతుందని తెలిపారు. అలాగే మే నెలలో జరగాల్సిన సెషన్‌ను ఈ నెల 27 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ సెషన్స్‌ కోసం ఈనెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రిజస్టిర్‌ చేసుకోవచ్చు. కోవిడ్ నేపథ్యంలో పరీక్ష జరిగే పట్టణాల సంఖ్యను కూడా పెంచారు.. గతంలో 232 పట్టణాల్లో సెంటర్లు ఉండగా.. ఇప్పుడు 334 పట్టణాలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.. పరీక్ష కేంద్రాల సంఖ్య 660 నుండి 828కి పెంచేశారు.. ఏప్రిల్ సెషన్ కి దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య 6.8 లక్షలుగా ఉండగా.. మే సెషన్ కి దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య 6.09 లక్షలుగా ఉంది.. మూడో, నాలుగో విడత జేఈఈ మెయిన్ రాయాలనుకునే వారికి
దరఖాస్తుకి మరో అవకాశం ఇచ్చారు.