Delhi Liquor Scam: ఈడీ మెరుపు దాడులు.. దేశవ్యాప్తంగా 30 చోట్ల సోదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ED Raids In 30 Places In Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో భాగంగా మంగళవారం ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ (ఈడీ) మెరుపు దాడులు చేసింది. దేశవ్యాప్తంగా ఏకకాలంలో మొత్తం 30 చోట్ల సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ, లక్నో, గురుగావ్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో ఈడీ సోదాలు జరుపుతోంది. ఒక్క హైదరాబాద్‌లోనే ఆరు చోట్ల తనిఖీలు జరుపుతున్నట్టు తెలిసింది. ప్రముఖ వ్యాపారవేత్త రామచంద్రన్‌పిళ్లై సహా మరో అయిదుగురికి సంబంధించిన కంపెనీలు, ఇళ్లల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌లో అభిషేక్ రావు, సృజన్ రెడ్డి, గండ్ర ప్రేమ్ సాగర్ ఇళ్లల్లో సోదాలు జరుగుతున్నాయి. రాబిన్ డిస్టిలర్స్ పేరుతో రామచంద్రన్ పిళ్లై బెంగళూరుతో పాటు హైదరాబాద్‌లో వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.
కాగా.. ఈ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ ఇప్పటికే కేసు నమోదు చేసింది. మొత్తం 15 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయగా.. వారిలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేరు కూడా ఉండడం రాజకీయంగా ప్రకంపనలు చెలరేగాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత హస్తం కూడా ఉందని కొన్ని రోజుల క్రితం బీజేపీ నేతలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే! అయితే.. కవిత ఈ ఆరోపణల్ని తోసిపుచ్చుతూ, తనపై ఆరోపణలు చేసిన వారి మీద కోర్టుకెక్కింది. ఈ కేసులో ఆమెకు ఊరట లభించింది. బీజేపీ నేతలకు కోర్టు నోటీసులు పంపించడంతో పాటు, కవితపై ఎవరూ వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కోర్టులో కొనసాగుతోంది.
Also Read
- Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
- Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
- SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
తాజావార్తలు
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!