MUDA scam: ముడా స్కామ్‌లో సీఎం సిద్ధరామయ్య పేరు.. షాకిచ్చిన ఈడీ..
- సీఎం సిద్ధరామయ్యకు ఈడీ షాక్..
- ముడా స్కాంలో భార్యతో పాటు ఆయన ప్రమేయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MUDA scam: కర్ణాటకలో సంచలనంగా మారిన మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్యతో పాటు ఆయన భార్యకు సంబంధం ఉందని ఈడీ పేర్కొంది. సిద్ధరామయ్య, ఆయన భార్య, ఆయన కుటుంబ సభ్యులకు ఈ స్కామ్‌లో సంబంధం ఉందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వెల్లడించింది. ప్రభుత్వం సేకరించిన భూమిని అక్రమంగా డీ-నోటిఫై చేయడం, మోసపూరిత భూమి మార్పిడి , సుమారు రూ.56 కోట్ల విలువైన సైట్ కేటాయింపులు వంటి పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఈడీ నివేదిక ప్రకారం.. ఈ కుంభకోణంలో అధికారిక రికార్డులు తారుమారు చేయడం, రాజకీయ ప్రభావాన్ని దుర్వినియోగం చేయడం, ఫోర్జరరీ వంటివి చోటు చేసుకున్నట్లు తెలిపింది. ప్రజాభివృద్ధి కోసం సేకరించిన భూమిని అక్రమంగా డీ నోటిఫై చేయడం ఈ కేసులో కీలకంగా ఉంది. ఈ ప్రక్రియను నిపుణుల సమీక్ష, ఎలాంటి శ్రద్ధ లేకుండా చేపట్టారని ఈడీ తెలిపింది. ఆ సమయంలో డిప్యూటీ సీఎంగా సిద్ధరామయ్య, ముడా బోర్డు సభ్యుడిగా ఉన్నారు. రెవెన్యూ అధికారుల మోసపూరిత భూ మార్పిడిని కూడా నివేదిక హైలెట్ చేసింది. నిర్మాణాలు శాటిలైట్ ఇమేజుల్లో, రికార్డుల్లో పొంతన లేకుండా ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో కీలక వ్యక్తి అయిన బీఎం మల్లికార్జున స్వామి సమర్పించిన నష్టపరిహార బాండ్లో ఆయన సంతకం లేకపోవడం వల్ల పత్రాలు తారుమారు జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
ఈ కేసులో సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతికి అక్రమంగా స్థలాల కేటాయింపు వివాదాస్పదమైంది. మార్గదర్శకాలను ఉల్లంఘించి ఆమెకు అత్యంత ఖరీదైన ప్రాంతంలో, విలువైన 14 స్థలాలను కేటాయించినట్లు దర్యాప్తులో తేలింది. అయితే, ఈడీ దర్యాప్తు ప్రారంభమైన తర్వాత ఈ స్థలాలను తిరిగి ముడాకు అప్పగించారు. స్థల కేటాయింపుల సమయంలో ముడా ఎమ్మెల్యేగా సిద్ధరామయ్య కొడుకు యతీంద్ర ఉన్నారు. ఈ కేసులో ఆయన ప్రమేయాన్ని కూడా ఎత్తి చూపింది. సిద్దరామయ్య సన్నిహితుడు సీటీ కుమార్ అని పిలువబడే ఎస్జీ దినేష్ కుమార్, పార్వతికి అనుకూలంగా సైట్ల కేటాయింపులలో ఫోర్జరీ, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
-
Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
-
BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?