Site icon NTV Telugu

Sanjay Raut : షాకిచ్చిన ఈడీ.. ఆస్తులు అటాచ్‌..

Sanjay Raut

Sanjay Raut

శివ‌సేన‌ ఎంపీ సంజ‌య్ రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) షాకిచ్చింది. పాత్ర ఛాల్ భూ కుంభ‌కోణంలో రౌత్ పాత్రపై గతంలో ఆరోప‌ణ‌లు వినిపించాయి. రూ. 1034 కోట్ల ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్‌ఎస్‌ఐ)పై విచారణకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మరియు అతని కుటుంబ సభ్యులకు చెందిన అలీబాగ్‌లోని ఎనిమిది ల్యాండ్ పార్సెల్‌లను అటాచ్‌ చేసింది. అంతేకాకుండా ముంబైలోని దాదర్‌లోని ఒక ఫ్లాట్‌ను తాత్కాలికంగా అటాచ్ చేసింది.

పాత్ర ఛాల్ భూ కుంభ‌కోణంలో ద‌ర్యాప్తును చేప‌ట్టిన ఈడీ.. తాజాగా రౌత్‌కు చెందిన స్థిరాస్తుల‌ను అటాచ్ చేసింది. ఈడీ అటాచ్‌పై స్పందించిన రౌత్‌.. ఈ త‌రహా బెదిరింపుల‌కు భ‌య‌ప‌డేది లేద‌ని తేల్చేశారు. ఆస్తుల‌ను సీజ్ చేసినా, కాల్చివేసినా, జైలుకు పంపినా కూడా భ‌య‌ప‌డేది లేద‌ని ఆయ‌న ప్రకటించారు. ఇదిలా ఉంటే.. ఈ కేసుకు సంబంధించి సంజయ్ రౌత్‌కు సన్నిహితుడిగా పేరున్న వ్యాపారవేత్త ప్రవీణ్ రౌత్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఈడీ అరెస్ట్ చేసింది. ఏప్రిల్ 1న, ఏజెన్సీ ప్రవీణ్‌పై ప్రాసిక్యూషన్ ఫిర్యాదు (ఛార్జిషీట్) దాఖలు చేసింది.

https://ntvtelugu.com/indian-government-blocked-22-youtube-channels/

Exit mobile version